తల్లి కావాలని కోరుకోని మహిళలూ ఉండదు. పెళ్లైన ప్రతి మహిళా పీరియడ్స్ మిస్
అవ్వగానే తాను తల్లి కాబోతున్నానని ఆనందపడుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రెగ్నెన్సీ
కాకపోవచ్చు. అసలు గర్భం ధరించామా లేదా అన్న విషయాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు
? ఒకవేళ గర్భం ధరించినట్లు కన్ఫర్మ్ అయితే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నీ అనుమానాలే.. అందుకే ఇక అనుమానాలు అన్నీ క్లియర్ చేసుకొండి.
ఈ విషయాలు గమనించండి
  • ఉదయం లేవగానే తల తిరగడం, వాంతి అయేటట్లు
    అనిపిస్తోందా
    ? ఇవి గర్భధారణకు సంకేతాలు. దీన్నే మార్నింగ్ సిక్నెస్అంటరు.
  • నెలనెల సక్రమంగా వచ్చే పిరియడ్ ఒక్కసారి మిస్సయితే మీరు
    గర్భం ధరించారని అనుకోవచ్చు. కానీ దీన్ని మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించుకోవాలి.
  • కొంతమందిలో స్తనాల పరిమాణం కూడా పెరిగే అవకాశాలున్నాయి.
  • మరికొంతమంది గర్భం ధరించిన కొన్ని రోజుల వరకు చిరాకు, ఉద్రేకంతో  ఉంటారు.
  • కొంత మందికి ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు
    నచ్చకపోవచ్చు. హార్మోన్లలో మార్పుల వల్ల ఇది జరుగుతుంది.
  • ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు.
  • త్వరగా అలుపు రావడం కూడా గర్భధారణకు ఓ సంకేతమే..

ఈ సంకేతాలు మీలో కనిపించిన వెంటనే మూత్రపరీక్ష చేసుకోని గర్భధారణ ను కన్ ఫార్మ్ చేసుకోవాలి. ఈ కీట్ లు మెడికల్
షాపుల్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఫలితం పాజిటీవ్ గా వస్తే వెంటనే డాక్టర్ను
సంప్రదించాలి.
  • గర్భం దాల్చిన తర్వాత కొద్ది నెలలు చాల జాగ్రత్తగా
    వ్యవహరించాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ
    , వారి సూచనలు పాటించడం
    మంచిది.
  • ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి
    ఈ ఆహారం ఎంతో ముఖ్యం.
  • మీ కండరాలకు బలన్ని చేకూర్చడానికి ఎక్సర్సైజులు చేయండి.
    డాక్టర్ అనుమతిలో చేసే ఈ వ్యాయామాల వల్ల బిడ్డ ఎదుగుదల చక్కగా ఉండడమే కాదు. ప్రసవ
    సమయంలో మీ కండరాలు త్వరగా వ్యాకోచించడానికి ఉపయోగపడుతుంది.
  • ప్రస్తుతం మీకున్న ఆరోగ్య సమస్యలు,
    ఇంతకు ముందు మీకు
    వచ్చిన ధీర్ఘకాలిక వ్యాధులు
    , మీకు జరిగిన సర్జరీల
    గురించి తప్పనిసరిగా మీ డాక్టరుకు తెలియజేయండి. వాటివల్ల మీ ప్రెగ్నెన్సీలో ఏమైన
    ఇబ్బందులు వచ్చే అవకాశముంటే ముందునుంచే జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు.

గర్భం దాల్చినప్పుడు ఏ పనీ చేయకూడదు. ఇవి తినాలి, అవి తినకూడదు.అంటూ ప్రతి ఒక్కరూ మనల్ని
కంగారు పెట్టేస్తుంటరు. అసలు ప్రెగ్నెన్సీలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం…
  • మీరు గర్భం దాల్చరని మీకు తెలిసిన నిమిషం నుంచే మీరు టీ, కాఫీ లాంటీ కెఫెన్ పదార్ధలు తక్కువగా తీసుకొండి. వీలైతే పూర్తిగా మానేయడం
    చేయాలి.
  • జంక్ ఫుడ్ వీలైనంత దూరంగా ఉండండి. ఎప్పుడైనా జంక్ఫుడ్
    తినాలనిపిస్తే వాటికి బదులు పండ్లు
    , మొలెకత్తిన గింజలు
    తీసుకోవడం వల్ల శరీరానికి ఉపయోగపడే పోషకాలు అందుతాయి.
  •  ప్రెగ్నెన్సీలో మరొక అతి ముఖ్యమైన విషయం ఏవి పడితే ఆ
    మందులను వాడకూడదు. తలనొప్పి
    , కాళ్లనొప్పులంటూ సొంతంగా
    కొనుక్కున్న మందులు అసలే వాడకూడదు. మీరేదైనా మందులు వాడాలనుకుంటే కేవలం డాక్టర్
    సూచనతో మాత్రమే వాడండి.
  • ఏ విషయం గురించైనా సరే ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి
    లోనవ్వకండి. తల్లికి ఎలాంటి ఒత్తిడీ లేకపోతేనే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు
    ఎక్కువ.
  • మీ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోండి. బాగా వేడినీటితో
    స్నానం చేయడం
    , ఎక్కువ సేపు ఆవిరిపట్టడం వంటివి చేయకపోవడం మంచిది. ఎండలో
    తిరిగి రాగానే మజ్జిగలంటివి తాగడం మంచిది.
  • పళ్లు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు మొలకెత్తిన విత్తనాలు, చేపలు వంటివి తీసుకోవడం
    వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
  •  రోజుకు పదిగ్లాసుల మంచినీరు తీసుకోవడం మర్చిపోవద్దు.
    కూల్ డ్రింక్  తాగాలనిపించినప్పుడు వాటి బదులు అప్పుడే తయారుచేసిన పండ్లరసం
    తాగొచ్చు.

ఈ సూచనలు తప్పక పాటిస్తే గర్భధారణ సమయంలో మీ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే మీ
బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Share.
Leave A Reply

Exit mobile version