వాతావరణం మారగానే
ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో
జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో
తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే
పనికొచ్చే కొన్ని సూచనలు…

  • సిల్కు, షిఫాన్ దుస్తులు
    వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు ఉతికే శ్రమ
    , ఆరబెట్టే సమయం ఆదా అవుతాయి.
  • పాదాలు
    ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే
    సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త
    గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది.
  • రాత్రి నిద్రపోయే
    ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి.
  • తల తడిస్తే
    వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు
    , జుట్టు కూడా రాలుతుంది.
  • కొబ్బరినూనెని
    వెచ్చబెట్టి జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిపడటమే
    కాదు
    , జలుబు చేయదు.
    నూనెతో మర్దనా చేసాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు కూడా పోతుంది.
  • వేడినీళ్లలో
    నాలుగు  యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు గాని
    , యూకలిప్టస్ ఆకులు
    గాని వేసి స్నానం చేస్తే ఈ కాలంలో తరచూ ఇబ్బందిపెట్టే జలుబు
    , జ్వరం, ఒళ్లు నొప్పులు
    తగ్గుతాయి. అలసట కూడా దూరమవుతుంది.
  • నువ్వుల నూనె
    రాసుకుని వారానికి ఒకసారి స్నానం చేయటం చర్మానికి
    , ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
  • తులసాకురసం, తేనె కలుపుకుని
    వర్షాకాలంలో అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి అస్తమానూ జలుబు
    , జ్వరాలు రాకుండా
    ఉంటాయి.
  • వర్షాకాలంలో
    జలుబు చేస్తే పంచదారని నిప్పులమీద వేసి వచ్చే పొగని పీల్చండి. జలుబు నుంచి వెంటనే
    ఉపశమనం దొరుకుతుంది.
Share.
Leave A Reply

Exit mobile version