
లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు పొడిగా, నొప్పిగా ఉంటుందని అంటున్నారు. దీనికి మానసిక సంసిద్ధత లేకపోవడం కూడా కారణం కావచ్చు. మీరు లైంగిక చర్యకు మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఆ సమయంలో ల్యూబ్రికేషన్కి అవసరమయ్యే స్రావాలు జననాంగాల వద్ద ఉత్పత్తి కావు. అందుకే మీకు కలయిక సమయంలో జననాంగ ప్రాంతం పొడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి లైంగిక చర్య కోసం మీరు మానసికంగా సంసిద్ధం కావడానికి ప్రయత్నించండి. అయినప్పటికీ మీకు కలయిక సమయంలో పొడిగా, నొప్పిగా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షలు చేయించుకోండి. అలాగే లైంగిక చర్య మొత్తం పూర్తయినప్పటికీ మీరు గర్భం ధరించడంలో సఫలం కాకపోతే అందుకు ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి మిగిలిన పరీక్షలు కూడా చేయించుకోవాలి.

