పురుషుల్లో
లైంగిక వాంఛలు కొంత ఎక్కువన్న మాట నిజమేగానీ. వాళ్లు రోజంతా దాని గురించే
ఆలోచిస్తుంటరన్నది పూర్తిగా అపోహే ! ఇదసలు అసాధ్యం కూడా. అయితే అవకాశం ఉన్నప్పుడు
, వీలున్నప్పుడల్ల
పురుషులు సెక్స్ గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు పురుషులు రోడ్ పై
నిలబడి ఉంటే ఆ పక్క నుంచి ఓ స్త్రీ వెళుతోందనుకోండి… ఆమె వంక ఓసారి తేరిపారజూసి
, మళ్లీ వాళ్ళ పని
వారు చుసుకుంటారు ! ఇది సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు.
ఇందులో సెక్స్ కోరిక లేకపోవచ్చుగానీ ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజ లక్షణం.
పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి
,
స్త్రీ గురించీ, సెక్స్ గురించీ ఆలోచించటమన్నది ఈ జాతి
వృద్ధికి అవసరమైన
, జీవ పరిణమంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు.సెక్స్ భావనలన్నవి ఇతర
ఇంద్రియ ప్రేరణల తర్వాతే అంటే దృశ్యం
, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన
సమాచారం అందిన తర్వాతే. శృంగార భావనలు తలత్తుతాయి. పురుషులకు ఇలాంటివి గ్రహించే
గుణం సహజంగానే ఎక్కువ. కాబట్టి వీరు స్త్రీ సంబంధ సంకేతాలకు త్వరగా
ఆకర్షితులవుతారు. ప్రకృతి సహజమైన ఈ ఎర్పాటు వెనకున్న లక్ష్యం సంతానాభివృద్ధీ
, జాతి మనుగడలే.
Share.
Leave A Reply

Exit mobile version