కావలసినవి
కొత్తిమీర – రెండుకప్పులు
పచ్చిమిర్చి – 6
చింతపండు – నిమ్మకాయంత
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
ఇంగువ – చిటికెడు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
తయారి :
- కొత్తిమీరను శుభ్రంగా కడగాలి.
- మిక్సీలో కొత్తిమీర,
పచ్చిమిర్చి,
ఇంగువ,
చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి.
(అవసరమనుకుంటే నీరు జత చేయాలి) - పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి.

