మసాలా
ఆవకాయ
కావలసినవి:
మామిడికాయ ముక్కలు కేజీ, నువ్వుల నూనెపావు కేజీ, కారంపావు కేజీ, అల్లం + వెల్లుల్లి ముద్ద పావు కేజీ, పసుపు టీ స్పూను, ఉప్పుపావు కేజీ, జీలకర్ర పొడి – 50 గ్రా., ధనియాల పొడి – 2, టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడిటేబుల్ స్పూను, మెంతి పొడిటీ స్పూను, పసుపుటేబుల్ స్పూను, జీలకర్ర + మెంతులుటీ స్పూను, ఇంగువటీ స్పూను, ఎండుమిర్చి – 10.
 తయారీ
మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలిఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపు కోవాలిమామిడికాయ ముక్కలు జత చేయాలి.

మరో
గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. చల్లారాక మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి. శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి ఆవకాయ మామూలు ఆవకాయ కంటె కాస్త ఘాటుగా ఉంటుంది.
Share.
Leave A Reply

Exit mobile version