కావలసినవి: 

ఖర్జూరాలు,
ఎండుకొబ్బరి,
పుచ్చకాయ గింజలు,
కర్బూజా గింజలు,
పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు… మొత్తం కలిపి అరకేజీఉండాలి.  (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు) ,
బెల్లం – అరకేజీ,
పటికబె ల్లం – మూడు టేబుల్ స్పూన్లు,
ఏలకుల పొడి – అర టీ స్పూను;
నెయ్యి – టేబుల్ స్పూను.

తయారి:

  • డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు)
  • ఖర్జూరాలను కుడా బాగా సన్నగా కట్ చేయాలి.
  • మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. 
  • ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటిక బెల్లం వేసి వేయించి బాగా కలిశాకపక్కన ఉంచుకోవాలి. 
  • బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండ పాకం వచ్చే వరకు ఉంచాలి; 
  • పటిక బెల్లం జత చేయాలి; ఫ ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరో మారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి; 

కిందకు దించి ఉండలు చేసుకుంటే డ్రైఫ్రూట్ లడ్డూ రెడీ…

Share.
Leave A Reply

Exit mobile version