కావలసినవి : 
పచ్చి మిర్చి – కేజీ (బజ్జీమిర్చి వాడాలి)
పుల్ల పెరుగు – 2 లీటర్లు
ఉప్పు – తగినంత
పసుపు – కొద్దిగా
ఇంగువ – టీ స్పూను

తయారీ

  • పచ్చి మిర్చిని నిలువుగా ఒక వైపు కట్ చేయాలి 
  • పుల్ల పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపాలి 
  • పచ్చిమిర్చిని అందులో వేసి ఒక రోజంతా ఉంచాలి 
  • మరుసటి రోజు పెరుగులో నుంచి మిర్చిని బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఉంచాలి 
  • పెరుగును కూడా ఎండబెట్టాలి
  • సాయంత్రం మిర్చిని పెరుగులో నానబెట్టాలి
  • మరుసటి రోజు మళ్లీ ముందులాగే ఎండబెట్టాలి 
  • ఇలా సుమారు ఐదు రోజులయ్యాక ఇంక పెరుగులో వేయకుండా కేవలం మిర్చి మాత్రమే ఎండబెట్టాలి 
  • పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకోవాలి 

వీటిని వేయించు కుంటే, మామిడికాయ పప్పులోకి రుచిగా ఉంటాయి.

Share.
Leave A Reply

Exit mobile version