• స్ట్రాంగ్ రూముల్లోని బ్యాలెట్ బాక్సుల భద్రతపై దీదీ సంచలన కామెంట్లు
  • బ్యాలెట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం
  • అన్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టం

బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కంటి మీద కనుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి వేళ కోల్‌కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ఈవీఎంలను మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. యంత్రాంగం అంతా మమతా బెనర్జీ చేతుల్లోనే ఉంటుంది. ఈసీ కేవలం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మాత్రమే చేపడుతుంది. అయినా ఈవీఎంలు మారుస్తున్నారని మమతా బెనర్డీ ఆరోపిస్తూ రాజకీయం చేస్తున్నారు.

అర్థరాత్రి పూట తాను పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అర్ధరాత్రి ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమె అక్కడే ఉండి ఈవీఎంల భద్రతను పర్యవేక్షించారు. విపక్షాలు ఈవీఎంలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, డేటా మార్చే అవకాశం ఉందని ఆమె ఆరోపించారు.

తమకు తెలియకుండానే స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు పలు చోట్ల నిరసనలు ప్రారంభించారు. ఓ వీడియో క్లిప్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండటంతోనే దీదీ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని .. ఇవన్నీ ఓటమికి కారణాలేనని బీజేపీ నేతలంటున్నారు. మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణల్ని ఈసీ ఖండించింది. స్ట్రాంగ్ రూమ్‌లు అన్నీ సురక్షితంగా ఉన్నాయని, అభ్యర్థులు , అబ్జర్వర్ల సమక్షంలోనే వాటిని సీల్ చేశామని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియలో అధికారులు పాల్గొన్నారని ముందే అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చామని ఈసీ వివరించింది.

మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు, ఆందోళనతో బీజేపీకి నిజంగానే ఈ సారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే మమతా బెనర్జీ ఇలా చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Share.
Leave A Reply

Exit mobile version