రాత్రి నిద్ర పోవడం ఆలస్యం. ఉదయం లేవడం ఆలస్యం. లేచాక ఆఫీసుకో, కాలేజికో…
టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం. కాస్త అటు ఇటు తేడాగా దాదాపు అందరిదీ ఇదే జీవనశైలి. దీనివల్లే చాలమందిలో విటమిన్–డి కొరత ఏర్పడుతోంది అంటున్నాయి తాజా అధ్యయనాలు. జనాభాలోని 84 శాతం మందిలో విటమిన్– డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయకోశ వ్యాధులకు ఈ లోపమే కారణం. అందుకే తరచుగా శరీరంలో విటమిన్– డి నిల్వలను పరీక్షించుకోవాలి. రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్–డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతి రోజూ కొంత విటమిన్–డిని శరీరానికి అందించండి.