కారణాలు        
జీవన
విధానం మారడంతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత యువత జీవన శైలి మారిపోయింది.
అంతేకాకుండా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ వారి దాంపత్య జీవితంపై
తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు.
మహిళలు, మగవారిలో కూడా సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలాగే
ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం
రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం సర్వసాధారణమైపోయింది. దాంతో సరైన వయసులో పెళ్లి
కాక
, పెళ్లైనవాళ్లలో కూడా మానసిక
ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక
,
సమస్యలు తలెత్తులున్నాయి.
సంతానలేమితో బాధపడేవారిలో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
స్త్రీలలో
ప్రధాన కారణాలు
  • ఋతుచక్రంలో మార్పులు
  • కొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం.
  • గర్భాశయపు నిర్మాణంలోను, ఆకృతిలోను… పుట్టుకతో వచ్చే లోపాలు
  •  గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం లేదా గర్భాశయ
    ముఖద్వారం వద్ద ఇన్ఫెక్షన్స్
  • గర్భాశయంలో గడ్డలు
  • కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన నాళాలు (ట్యూబ్స్)
    మూసుకొనిపోవటం
    , నాళాలలో
    వాపు ఏర్పడటం.
గర్భధారణలో
నాలుగు ప్రధాన అంశాలు
  1. ఋతువు: సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన
    12వ రోజు నుండి 16 వ రోజు వరకు ఋతుకాలంగా పరిగణిస్తారు. 12 నుండి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అండం విడుదల
    కావచ్చు. అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా ఋతుకాలంగా పరిగణిస్తారు. (సాధారణంగా
    21 – 35
    సంవత్సరాల వరకు)
  2. క్షేత్రం : కొన్నిసార్లు గర్భాశయ మార్గాలను
    అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్ర కణాలు అండాన్ని చేరలేక పోవచ్చు. కనుక విత్తనం
    మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి.
  3. అంబు : గర్భపోషణకు ఉపయోగపడే పోషకాలు,
    గర్భాధారణకు ఉపయోగపడే
    హార్మోన్లను అంబు అని ఆయుర్వేదం వర్ణించింది. ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం
    రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి.
  4. బీజం : ఆయుర్వేదంలో పురుషుల్లోని వీర్యాన్ని
    బీజంఅనే పదంతో సూచించారు. అండం పరిమాణం,
    శక్తి, శుక్ర కణంలో కదలగలిగే సామర్థ్యం,
    శుక్రకణం నాణ్యత మీద గర్భధారణ
    ఆధారపడి ఉంటుంది.
మగవారిలో
సంతానలేమి
సంతానలేమికి
కారణాలన్నవి అటు మహిళలలోనూ
, ఇటు
పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండే అవకాశం ఉంది. అసలు పురుషుల్లో సంతానలేమి
ఎందుకు వస్తుంది
?
సమస్యను నిరోధించే మార్గాలేంటి
? అనేది
పరిశీలిస్తే … కాలంతో పాటు పరిగెడుతున్న జీవితాలు
, నిత్యం పలుసమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి
గురికావడం కారణంగా సంతాన లేమి సమస్య తెలెత్తుతున్నట్లు నిర్ధార్ధించారు. మన జీవనశైలితో
పాటు కాలుష్యం
, వాతావరణం,
పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.
పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం
, ఉన్నా వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం
లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం
కష్టమే. 
మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. భార్యాభర్తలు ఏ గర్భనిరోధక
సాధనం వాడకుండా ఒక సంవత్సర వైవాహిక జీవితం కొనసాగించిన తరువాత కూడా సంతానం కలుగకపోతే
దానిని సంతానరాహిత్యం లేదా సంతానలేమి అంటారు. ఈ సమస్య ఇప్పుడు మగవారిలో అధికంగా పెరిగిపోతోంది. 
ఆధునిక జీవన విధానం మగవారిలో ఈ సమస్యను పెంచుతోంది. సంతానం కలగచేసే సామర్థ్యం పురుషుల్లో
క్షీణిస్తోంది. వారిలో వీర్య సామర్థ్యం తగ్గిపోతోంది. దానినే మేల్ ఫెర్టిలిటిగా పేర్కొంటున్నారు.
పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. ప్రతి
మగవారిలో సాధారణంగా
3-6
మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యంలో దాదాపు
60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి
తల
, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి.
మామూలు వీర్యంలో దాదాపు
60
నుంచి
70
శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి. పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే
దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను
పరిశీలిస్తే మగవారిలో
40
శాతంగా ఉంటుంది. ఇద్దరిలో కలిపి
10
శాతం సమస్యలు ఉంటే
, తెలియని
కారణాలు
10
శాతం ఉంటాయి.
మగవారిలో
సంతానలేమి సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి. హార్మోన్ల లోపం
, మానసిక ఒత్తిడి, వెరికోసిల్ ఒక రకం కారణాలు ఐతే, ధూమపానం, మద్యపానం మరోరకం కారణాలుగా వైద్యులు నిర్ధారించారు.
బీజంలో వివిధ ఇబ్బందులు
, అంగస్థంభన
సమస్యలు
, పుట్టుకతో
వచ్చే లోపాల వల్ల ఇన్ఫెర్టిలిటీ తలెత్తుతుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి
పలు పరీక్షలున్నాయి. ఆ పరీక్షల ద్వారా కారణం తెలుసుకొని వైద్యుల సలహాపై తగిన మందులు
వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్వేర్
ఉద్యోగస్తులకు సంతానలేమి
సాఫ్ట్వేర్,
దాని అనుబంధ రంగాల్లో
పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు 
ఐటీ
రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది.
  1. ఆలస్యపు వివాహాలు, మానసిక ఆందోళన, పని ఒత్తిడి,మారిన జీవన శైలి, ఊబకాయం, రుతుక్రమం తప్పడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన
    కారణం
  2. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్ట్యాప్లను
    ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై రేడియన్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
  3. ప్రతి వంద జంటల్లో 15 శాతం మందికి సంతానలేమి సమస్య వల్ల చికిత్సతీసుకోవాల్సిన
    అవసరం ఏర్పడుతోంది. ఆ పదిహేను శాతంలో కూడా
    40 మంది పురుషులే. ఈ పెరుగుదల రేటు ఆందోళనకరంగా
    ఉంది.
  4. ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం ఇన్ఫెర్టిలిటీ
    రేటు
    50
    శాతం పెరిగింది.
  5. దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల జంటలు సంతానలేమితో
    బాధపడుతున్నాయి.
  6. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు జబ్బులతో సంతాన లేమి సమస్య పోటీపడుతోంది.
  7. 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురు యువకుల్లో
    ఒకరికి వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ గా ఉంటోంది.
  8.  అతిగా మద్యం సేవించిడం, పొగతాగడం కూడా ఇందుకు మరో కారణం.

Share.
Leave A Reply

Exit mobile version