
విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహనికి
గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ బాదితులలో 5 కోట్ల 8 లక్షల మంది
భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహం ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో చేరడానికి
దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు
పాటించి నివారించుకోవచ్చు. అందుకే మధుమేహం ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన
అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు.
మధుమేహం ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు
సంబంధించిన సమస్య ఉంది మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం
ఆసుపత్రిలో ఉండాల్సిరావడం కారణంగా చాలమంది బాధ పడుతున్నారు. దీర్ఘకాలంగా మధుమేహం
ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉంది. పాదాలపై ఏర్పడే పుండ్లు, ఎర్రని మచ్చలు, లోపలకుపెరిగిన
గోళ్లు, తీయడానికి
కష్టంగా ఉన్న ఆనెలు, చీము
ఏర్పడడం, వేలు లేదా పాదం నల్లబడడం (గ్యాంగ్రీన్), ముదిరితే ఆ భాగం లేదా మొత్తం పాదం తీసివేయాల్సి రావడం
జరుగుతుంది.
సంబంధించిన సమస్య ఉంది మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం
ఆసుపత్రిలో ఉండాల్సిరావడం కారణంగా చాలమంది బాధ పడుతున్నారు. దీర్ఘకాలంగా మధుమేహం
ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉంది. పాదాలపై ఏర్పడే పుండ్లు, ఎర్రని మచ్చలు, లోపలకుపెరిగిన
గోళ్లు, తీయడానికి
కష్టంగా ఉన్న ఆనెలు, చీము
ఏర్పడడం, వేలు లేదా పాదం నల్లబడడం (గ్యాంగ్రీన్), ముదిరితే ఆ భాగం లేదా మొత్తం పాదం తీసివేయాల్సి రావడం
జరుగుతుంది.
పాదాల పుండ్లను అంచనావేసి చికిత్స చేసేందుకు చాలా
పద్దతులున్నప్పటికీ సాధారణంగా వేగర్స్ పద్ధతి ప్రకారం ఆరు గ్రేడులుగా
విభజిస్తారు.
పద్దతులున్నప్పటికీ సాధారణంగా వేగర్స్ పద్ధతి ప్రకారం ఆరు గ్రేడులుగా
విభజిస్తారు.
- గ్రేడ్
0 : పుండ్లు లేనప్పటికీ పుండ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. - గ్రేడ్
1 : పుండు ఉపరితం వరకే పరిమితమై ఉంటుంది. - గ్రేడ్
2 : పుండు చర్మం కింద కండరం, ఎముక, కీలు లోకి పాకి ఉంటుంది. - గ్రేడ్
3 : పుండు లోతుగా క్రిమి దోషం తో ఉంటుంది. ఆస్టియోమైలైటిస్ అంటే ఎముకకు కూడా
క్రిమి దోషం ఉంటుంది. - గ్రేడ్
4 : ఏదో ఒక భాగంలో కణజాలం కుళ్లిపోయి ఉంటుంది. దీనినే లోకలైజ్డ్ గాంగ్రీన్
అంటారు. - గ్రేడ్
5 : ఈ దశలో గాంగ్రీన్ చాలా విస్త్రృతంగా వ్యాపించి ఉంటుంది. ఆ భాగం తొలగించాల్సి
వస్తుంది.
పాదాల పుండ్లకు చికిత్స
- అవసరమైన
మేరకు ఇన్సులిన్ ఇంజక్షన్తో మధుమేహాన్ని నియంత్రించాలి. - చెడు, చనిపోయిన కణజాలాన్ని తొలగించి, గాయాన్ని శుభ్రపరచాలి.
- ఇన్ఫెక్షన్
నియంత్రించేందుకు సరైన యాంటిబయాటిక్స్ వాడాలి. - పుండు
మానేసేందుకు వీలుగా పాదంపై బరువుమోపకుండా చూడాలి. - చర్మం
ఎక్కువగా పోయిన సందర్భాల్లో మానని పుండుపై చర్మం అతికించడం చికిత్సలో భాగం. - మొండిగా
ఉన్న కేసుల్లో ఆ భాగాన్ని లేదా పాదాన్ని తొలగించి ప్రొస్తెటిక్ ఆంగాల్ని అమర్చడం
మరో చికిత్స.
పాదాల సంరక్షణ
- మధుమేహ
రోగి ప్రతి రోజూ తన పాదాలను పరీక్షించుకోవాలి. ఏవైనా పుండ్లు, కాలిన గుర్తులు, బొబ్బలు, చర్మం నల్లబడడం, లేదా
ఎర్రని ఆనెలు, వేళ్ల వంకర, లోపలికి పెరుగుతున్న వేలిగోళ్లు వంటి మార్పులు
గుర్తించాలి. పాదాల అడుగు భాగాన్ని కూడా పరీక్షించుకోవాలి.
చేయాల్సినవి
- ప్రతి
రోజూ మీ పాదాలను గోరువెచ్చని నీళ్లు, సబ్బుతో
శుభ్రపరుచుకోవాలి. - పాదాలను
వేళ్ల మధ్య భాగంలో కూడా పొడిగా ఉండేలా తుడుచుకోవాలి. - వేళ్ల
గోళ్లను సమంగా కత్తిరించండి. - పాదాల
చర్మం పొడిగాఉంటే మాయిశ్చరైజర్ లోషన్ రాయండి. వేళ్ల మధ్య రాయకండి. - పాదాలకుఎక్కువ
చెమట పడుతుంటే, ఏదైనా
టాల్కమ్ పౌడర్ రాయండి. - ప్యూమైస్
రాయితో ఆనెలను లేదా గరుకు చర్మాన్ని అరిగేలా చేయండి. - మెత్తని, సరైన పాదరక్షలు ధరించండి. కాళ్లకు సరిపడే మేజోళ్లను
వాడండి. కాస్త వదులుగా ఉంటే మంచిది. - పాదరక్షలు
కొత్తవి కొన్నప్పుడు నిదానంగా, రాపిడి
తగలకుండా అలవాటు చేసుకోండి. ఎంచుకునేటప్పుడు వేళ్లవైపు వెడల్పుగా ఉండేలా, మడమ భాగం కూడా ఇరుకుగా లేకుండా చూసుకోండి. - రోజూ
ధరించడానికి ముందు మట్టి, చిన్న
రాళ్లు, మేకులు వంటి
వాటికై పాదరక్షలు పరిశీలించాలి. - కాళ్లల్లో
రక్తప్రసారం మెరుగయ్యేందుకు రోజూ పాదాల్ని కిందకూ, పైకీ, పక్కలకూ
కదుపుతూ వ్యాయామం చేయాలి.
పుండ్లు ఎప్పుడు ఏర్పడతాయి ?
- ఇంతకుముందు
పాదానికి పుండు ఏర్పడి, తగ్గి
పోయినప్పుడు. - ఇప్పటికే
ఒక కాలు తీసివేసి ఉన్నవారిలో, రెండో
కాలికి ఏర్పడే అవకాశం ఎక్కువ. - ఆనెలు
వంటివి ఏర్పడటం. - పాదాల
నిర్మాణంలో తేడా ఉండడం. అంటే వంకర పాదం, వేళ్లు
వంకర. - పాదానికి
రక్తప్రసరణ తగ్గడం. - పెరిఫరల్
నాడీవ్యవస్థ దెబ్బతిని నొప్పి, వేడి, చల్లదనం వంటి జ్ఞానం తెలీకుండా మొద్దుబారడం. - చూపు
కోల్పోయిన వారిలో. - మూత్రపిండాల
పనితీరు మందగించిన వారిలో. - ఒంటరిగా
ఉండే వృద్ధుల్లో. - ఇవి
గాక ధూమపానం, మద్యపానం, అవగాహన లోపం వంటివి అదనంగా పుండ్లు ఏర్పడేందుకు
దారితీస్తాయి.
కారణాలు
- పాదాలకు
రక్తప్రసరణ తగ్గిపోవడం. - పాదాలకు
సంబంధించిన నాడీవ్యవస్థ పనితీరు మందగించడం. - క్రిమిదోషం
(ఇన్ఫెక్షన్).
పై మూడు కారణాల వల్ల సంభవించే ప్రమాదకరమైన పాదాల
సమస్యలకు చికిత్స కంటే పాదాల సమస్య రాకుండా నివారణ అత్యంత ముఖ్యం.
సమస్యలకు చికిత్స కంటే పాదాల సమస్య రాకుండా నివారణ అత్యంత ముఖ్యం.

