
స్త్రీకి 20-30 సంవత్సరాల వయసులో గర్భం వస్తుంది. ఆపైన గర్భం రావడం తక్కువ. సాధారణంగా పురుషునిలో ఇటువంటి పరిస్థితి కనబడదు. పురుషుడు ఏ వయస్సులో పాల్గొన్నా అతనివల్ల గర్భం మామూలుగానే వస్తుంది.
రతిలో ఎక్కువసార్లు పాల్గొనేవారిలో గర్భం త్వరగా వస్తుంది. తక్కువ పాల్గొనేవారిలో గర్భం రావడం ఆలస్యం అవుతుంది. వారానికి ఒకసారే రతిలో పాల్గొంటే ఆరునెలల్లో గర్భం వచ్చేవారు 1-2 సార్లు రతిలో పాల్గొనే దంపతులలో 6 నెలలలోగా గర్భం దాల్చేవారు 32 శాతం మంది వుంటారు. వారానికి 2-3 సార్లు పాల్గొనే దంపతులలో 6 నెలలలోగా 46 శాతం మంది గర్భం దాల్చుతారు. వారానికి 3-4 సార్లు పాల్గొనే దంపతులలో 51 శాతం మంది ఆరునెలల్లో గర్భం దాల్చుతారు. వారానికి 4 సార్లు కంటే మించి రతిలో పాల్గొనే దంపతులు 83 శాతం మంది 6 నెలల్లో సంతాన సాఫల్యత పొందుతారు.
వంధ్యత్వ సమస్య ఎక్కువకాలం వున్నవారు సంతాన సాఫల్యత పొందడం ఆలస్యం అవుతుంది. అందుకని వంధ్యత్వం వున్నవారు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం అవసరం.

