నా వయస్సు ముప్పై సంవత్సరాలు. పెళ్ళైంది. ఇద్దరమూ బాగానే ఉండే వాళ్లం. కానీ ఎందుకో మెల్లగా ఇద్దరి మధ్యా దూరం పెరుగుతున్నట్లనిపిస్తోంది. నాకు శారీరక కోరిక తక్కువ. మా మధ్య పెరుగుతున్న దూరానికి అదే కారణమా? నాకెందుకిలా అందులో ఆసక్తి లోపిస్తోంది? సైకలాజికల్ కారణాలేమైనా ఉన్నాయంటారా? ఏం చేస్తే మా అనుబంధం మరింత పటిష్ఠమవుతుందో చెప్పరూ?

బాధాకరమైన అనుభవాలు సెక్స్ పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. మనసు ప్రభావం శరీరం మీద పడుతుంది. కొన్ని రకాల ఆలోచనలు, అనుభూతులు, భావోద్వేగాలు… పరిస్థితిని బట్టి లైంగికేచ్చను తగ్గించగలవు. ఒక్కోసారి కొన్ని భయలు కూడా అందుకు కారణమవుతాయి.
తగిన సాన్నిహిత్యం లేకపోవడం, ఎదుటి వ్యక్తి కోరుకున్నట్లుగా స్పందించలేనేమోనన్న భయం, తమ శరీరం పట్ల తమకే అసంతప్తి, బాల్యం నుంచీ భావాలను ప్రకటించే స్వేచ్ఛ లేకుండా పెరగడం.. ఇలాంటి వన్నీ కూడా కోరికలను అణచివేస్తాయి.
దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు… సన్నిహితంగా మసలాలన్న కోరికను చంపేస్తాయి. డిప్రెషన్ లాంటి మానసిక సమస్య కూడా సెక్స్ పట్ల ఆసక్తి లేకుండా చేస్తుంది.
అందుకని ఆలస్యం చేయకుండా మీరు సెక్సాలజిస్టుని సంప్రదించడం మంచిది.

Share.
Leave A Reply

Exit mobile version