
అంగం స్తంభించకపోవడానికి నరాల బలహీనత అనేది ఒక కారణం మాత్రమే. నరాల బలహీనతవల్ల అంగం స్తంభించకపోవడం చాలా అరుదు. షుగర్ వుంటే సెక్స్లో అసమర్థత కలగవచ్చు, నరాలు మొద్దుబారవచ్చు, వెన్నుకి ఆపరేషన్ జరిగితే అటోనామిక్ నర్వ్ సిస్టం దెబ్బతినవచ్చు. అయితే అందరిలోనూ కాదు. కానీ అలా జరుగుతుందని భయపడితే వాస్తవానికి అక్కడి నరాలు దెబ్బతినక పోయినా, భయంవల్ల అంగస్తంభనాలు లేకపోవచ్చు. అందుకని నిజంగానే నరాలు దెబ్బతిన్నదీ లేనిదీ నిర్ధారణ చేయడానికి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ తోడ్పడుతుంది.
సెక్స్లో
పాల్గొనలేకపోతే, అంగం స్తంభించకపోతే, రతి మధ్యలోనే అంగం మెత్తబడిపోతే నరాల
బలహీనత ఉందని అనుకుంటారు. కాని ఇలా అనుకునేది నిజంగా నరాల బలహీనత కానేకాదు.
భయంవల్ల, ఆందోళన వల్ల అంగం స్తంభించకుండా అవుతుంది లేదా రతి మధ్యలోనే అంగం
మెత్తబడిపోతుంది. సాధారణంగా కొత్త అనుభవం కావడం, కొత్త వ్యక్తులు, కొత్త
పరిసరాలు కావడం అంగస్తంభన వైఫల్యానికి కారణాలు. ఆ పరిసరాలు, ఆ వ్యక్తులు
పాతబడిపోతే భయంలేని వాతావరణ ఏర్పడితే అంగస్తంభనలు పటిష్టంగానే కలుగుతాయి.పై
విషయాలని అర్థం చేసుకుంటే మొదట్లో అంగస్తంభన వైఫల్యం కలిగినా ఈజీగా
తీసుకుని ఆ తర్వాత చక్కని అంగస్తంభనలతో సెక్స్ ఎంజాయ్ చేస్తారు. సెక్స్
గురించి అవగాహన లేనివాళ్ళు ఒకసారి సెక్స్లో ఫెయిల్ అయితే ఒక విధమైన
భయాన్ని, యాంక్జైటీని పెంచుకుని రతిలో పాల్గొన్న ప్రతిసారి అంగస్తంభన
వైఫల్యాన్ని పొందుతారు.
ప్రత్యేకంగా చేసే నరాల పరీక్షల్లోనేకాకుండా రొటీన్గా చేసే పరీక్షల్లో కూడా అంగ స్తంభనకు తోడ్పడే నరాలు దెబ్బతిన్నదీ లేనిదీ తెలుస్తుంది. వీరిలో సాధారణంగా ‘నీ హమర్’తో చేసే పరీక్షలో కాళ్లలోని డీప్ టెండాన్ రిఫ్లెక్స్ తక్కువ స్థాయిలో వుంటాయి. బల్బోకావర్నస్ రిఫ్లెక్స్ లేకుండా అవుతుంది. సూదితో గుచ్చితే యస్ 2, యస్ 4 నర్వ్స్ సరఫరా అయ్యే ప్రదేశాలు మొద్దుబారి వుంటాయి. ఈ పరీక్షలు అతి సింపుల్. రొటీన్గా చేసేవి. వీటిని బట్టి అంగస్తంభనకి కావలసిన నరాలు ఆర్డర్లో వున్నవీ లేనివీ తెలుస్తుంది.
తెల్లవారుఝామున జరిగే అంగస్తంభనల ప్రాధాన్యత
ఇటువంటి పరిస్థితి వున్నవారు తమకి నరాల బలహీనత వుందని అపోహ చెందుతారు.వాస్తవానికి వీరిలో అంగస్తంభనలకి కావలసిన నరాలు పెర్ఫెక్ట్గా వుంటాయి. యన్.పి.టి.(నాక్టర్నల్ పెనైల్ ట్యుమెసెన్స్) టెస్ట్ ద్వారా ఇది నిర్ధారణ చేసుకోవచ్చు. వీరిలో మెలకువగా వున్నప్పుడు అంగం స్తంభించడం వుండదు. నిద్రలో మాత్రం అంగం పూర్తిగా గట్టిపడుతుంది. ముఖ్యంగా తెల్లవారుఝామున అంగం బాగా గట్టిపడి కనబడుతుంది.
అంగస్తంభన వైఫల్యానికి పరీక్షలు
యన్.పి.టి. టెస్ట్ని ఎవరిమటుకు వారు స్వయంగా చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పెర్ఫొరేషన్ (కన్నాలు) వున్న పోస్టల్ స్టాంపులని పురుషాంగానికి గుండ్రంగా అంటించాలి. నిద్రలో అంగం స్తంభించగా పోస్టల్ స్టాంపులకి మధ్య కన్నాలు వున్నచోట చిరిగి వేరు వేరు అవుతాయి. అలా వేరైన స్టాంపులబట్టి అంగం స్తంభించినట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. నరాల బలహీనతే వుంటే అంగం స్తంభించడం, పెర్ఫొరేషన్ దగ్గర స్టాంపులు చిరిగి వేరు అవడం జరగదు.
ఎలక్ట్రోమయోగ్రఫీ (ఇ.యం.జి) : పరీక్షల ద్వారా కూడా నరాల వ్యాధిని గుర్తించవచ్చు.
వాసోయాక్టివ్ డ్రగ్స్తో టెస్ట్ : పురుషాంగానికి నేరుగా కావర్నస్ సైనస్లోకి ‘పపావరిన్’ఇంజక్షన్ చేస్తే 10 నిమిషాల్లోనే అంగం పూర్తిగా స్తంభిస్తుంది. ఈ టెస్ట్ కూడా అంగస్తంభనానికి నరాలు చక్కగా పనిచేస్తున్నాయని తెలియజేస్తుంది.
డాపలర్ ఎగ్జామినేషన్ ద్వారా అంగస్తంభనానికి కావలసిన రక్తప్రసారం సక్రమంగా వున్నదీ లేనిదీ, రక్తనాళాల పరిస్థితి ఎలా వున్నదీ తెలుస్తుంది.
పెనైల్ బ్రేకియల్ ఇండెక్స్ కూడా అంగస్తంభనకి కావలసిన సమాచారాన్ని తెలియ జేస్తుంది. ఒక స్పెషల్ పెనైల్ కఫ్, డాపలర్ ప్రోబ్తో పురుషాంగమూ- చెయ్యికి సంబంధించిన సిస్టోలిక్ బ్లడ్ప్రెషర్స్ గుర్తించి పెనైల్ రీడింగ్తో చెయ్యికి చెందిన రీడింగ్తో డివైడ్ చేస్తే పెనైల్ బ్రేకియల్ ఇండెక్స్ వస్తుంది. ఇది 0.8 కంటే తక్కువ వుంటే పురుషాంగానికి రక్త ప్రసారం తక్కువ వున్నట్లు, దానివల్ల అంగస్తంభనలు లేనట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఈ విధంగా అంగస్తంభనకి సంబంధించిన పరీక్షలు అవసరం బట్టి చేసి అంగస్తంభనం ఎందుకు లేదో నిర్ధారణ చేసుకోవచ్చు.
వినాళగ్రంధుల లోపం వల్ల సెక్స్ బలహీనత
మెదడులో వుండే పిట్యూటరీ గ్రంధి, మెడ ముందు వుండే థైరాయిడ్ గ్రంధి, కడుపులోవుండే పాన్క్రియాస్ గ్రంథి పొత్తికడుపు దిగువున వుండే ఓవరీస్- ఇవన్నీ వినాళ గ్రంధులే.ఈ వినాళ గ్రంధులు కొన్ని రకాల హర్మోన్లని తగిన మోతాదులో విడుదల చేస్తాయి. అవి మొదటినుంచి తగినంత విడుదల చేయకపోయినా, మొదట్లో బాగానే వుండి, తరువాత తగ్గినా ఇతర శారీరక బాధలతో పాటు సెక్స్ బలహీనత కూడా ఏర్పడుతుంది.
ఉదాహరణకి- పాన్క్రియాస్ గ్రంధి నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోయినా, తగ్గిపోయినా మధుమేహం (డయాబెటిస్) వ్యాధి వస్తుంది. మధుమేహం వ్యాధినే చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి కలగడం వల్ల రక్తంలో షుగర్ శాతం అధికంగా పెరిగిపోతుంది.దీనిని మొదట్లోనే గుర్తించి చికిత్స పొందకపోయినా, లేదా వ్యాధిని పూర్తిగా అదుపులో వుంచకపోయినా కొందరిలో నరాలు మొద్దుబారతాయి. రక్తనాళాలు సన్నబడతాయి. రక్త ప్రసారం తగ్గుతుంది. పైగా వీరిలో ప్రోలాక్టిన్ లెవెల్స్ పెరుగుతాయి. వీటన్నింటివల్ల అంగం తగినంత గట్టిపడదు.
- సెక్స్ బలహీనతలో పురుష సెక్స్ హర్మోన్ల పాత్రపైన పేర్కొన్న రెండు హర్మోన్లకంటే పురుషునిలో వృషణాల నుంచి విడుదలయ్యే సెక్స్ హర్మోన్ (టెస్టోస్టిరోన్) లైంగిక సామర్థ్యానికి ఎక్కువ తోడ్పడుతుంది. పురుష సెక్స్ సామర్ధ్యానికి తోడ్పడే ఈ హర్మోన్లని యాండ్రోజన్స్ అని అంటారు.
ల్యూటినైజింగ్ హర్మోన్ సరిగ్గా విడుదల కావాలంటే మెదడులోని హైపోథాలమస్ ప్రాంతం నుంచి గొనాడోట్రాపిన్ రిలీజింగ్ హర్మోన్ తగినంత ఉత్పత్తి కావాలి. ఈ గొనాడోట్రాపిన్ రిలీజింగ్ హర్మోన్ సరిగ్గా విడుదల కావాలంటే మెదడులో వుండే న్యూరల్ పెప్టయిడ్స్, న్యూరో ట్రాన్స్మీటర్ అనే ఎంజైమ్స్ సక్రమంగా పనిచేయాలి.
సెక్స్ని ప్రభావితం చేసే ఇతర హర్మోన్లు
ఇవే కాకుండా డోపమిన్ అనే మరో ఎంజైమ్ తక్కువ ఉత్పత్తి కావడంతో పిట్యూటరీ గ్రంధి నుండి ప్రోలాక్టిన్ హర్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయి గొనాడో ట్రాపిన్ రిలీజింగ్ హర్మోన్ని తగినంత విడుదలకాకుండా చేస్తుంది. దానితో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గి అంగస్తంభనం సక్రమంగా లేకుండా అవుతుంది. అందుకని అంగస్తంభనాలు నిజంగా తగినంత లేనప్పుడు సీరం ప్రోలాక్టివ్ లెవెల్స్ ఎక్కువ అయినదీ లేనిదీ గమనించాలి. అలాగే ల్యూటనైజింగ్ హర్మోన్ శాతం ఎంత వున్నదీ తెలుసుకోవాలి. ఒకవేళ సీరం ప్రోలాక్టివ్ శాతం పెరిగితే తగ్గడానికి బ్రోమోక్రిస్టిన్ మందులు వాడాలి.స్టోస్టిరాన్ హర్మోన్ శాతం పరీక్షచేసి, తక్కువ వున్నట్లయితే ఈ హర్మోన్ ఇంజక్షన్స్పది- పదిహేను రోజులకి ఒకటి చొప్పున చేయించాలి. హర్మోన్ల లోపం వున్నవారికి ఈ ఇంజక్షన్స్ చేయించుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
పురుషాంగానికి రక్తప్రసరణ లోపంతో పుంసత్వంలో తేడా
సెక్స్లో పాల్గొన్నప్పుడు అంగస్తంభన వైఫల్యం కలగడంలో మానసిక ఆందోళన ప్రథమ స్థానం ఆక్రమించగా ఆ తరువాత స్థానం పురుషాంగంలోని రక్తనాళాల లోపం రెండవ స్థానం పొందుతుంది.
దీర్ఘకాలంగా రక్తపోటు వున్నవారిలో, ఎథిరోస్ల్కిరోసిన్ వల్ల రక్తనాళాలు గట్టిపడినవారిలో, అధికంగా పొగతాగే అలవాటున్నవారిలో, రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ అధికశాతంలో వుండేవారిలో పురుషాంగానికి రక్తప్రసారం లోపం రావచ్చు.
బీర్జాలకి దిగువభాగంలో ప్రమాదవశాత్తు గాయమై రక్తనాళాలు దెబ్బతిన్నవారిలో, పురుషాంగానికి రక్తప్రసారం చేసే రక్తనాళాలకి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు రక్తప్రసరణలో లోపం ఏర్పడి అంగస్తంభన అంత పటిష్టంగా వుండకపోవచ్చు.
- రక్తప్రసరణలో లోపంవల్ల అంగం సక్రమంగా స్తంభించడంలేదా, మానసిక ఆందోళన వల్ల స్తంభించడం లేదా అనేది తెలుసుకోవడానికి, నిద్రలో అంగస్తంభనాలు వున్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ‘నాక్టర్నల్ పెనైల్ ట్యుమెసెన్స్ అండ్ రిజిస్కాన్’, పెనైల్ బ్రేఖియల్ ప్రెషర్ ఇండెక్స్, డోపలర్ వేవ్ఫార్మ్ ఎనాలసిస్, పెనైల్ థెర్మోగ్రఫీ వంటి పరీక్షలు తోడ్పడతాయి. అలాగే కేవర్నో సిమెట్రీ, కేవర్నోగ్రఫీ పరీక్షలు తోడ్పడతాయి.
- రక్తనాళాల్లో లోపం తెలుసుకోవడానికి పెనైల్ యాంజియోగ్రఫీ కూడా తోడ్పడుతుంది. కానీ ఈ పరీక్షలు ఖర్చు, శ్రమతో కూడుకున్నట్టివి.ఇంట్రాకేవర్నస్ పెపావర్న్ ఇంజక్షన్ పై పరీక్షలతో అవసరం లేకుండానే ”ఇంట్రాకేవర్నస్ పెపావరిన్ ఇంజక్షన్” పరీక్ష చక్కని సమాచారాన్ని అందజేస్తుంది. 60 మి.గ్రా. పపావరిన్ ఇంజక్షన్ పురుషాంగంలోని కేవర్నస్ సైనసస్లోకి చేయడంతో కొద్ది నిమిషాల్లోనే అంగం స్తంభిస్తుంది.
- ఇంజక్షన్ చేసిన తరువాత అంగం స్తంభించడానికి తీసుకున్న సమయం, అంగస్తంభన నిలబడిన సమయం రక్తనాళాల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. అంగం సరిగ్గా స్తంభించడం వుండకపోతే దానికి కారణాన్ని తెలియజేస్తుంది. పపావరిన్ ఇంజక్షన్ బదులుగా ”ప్రోస్టాగ్లాండిన్ ఇ1” ఇంజక్షన్ కూడా వాడవచ్చు.
పురుషాంగానికి రక్తప్రసరణలో లోపంవుంటే, రక్తనాళాలు సన్నబడి రక్తప్రసరణ తక్కువ వుంటే ఇంట్రాకేవర్నస్ పెపావరిన్ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత స్తంభించడానికి పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకవేళ స్తంభించినా అంగం పూర్తిగా గట్టిపడటం జరగదు. ఒకవేళ కొద్దో గొప్పో గట్టిపడినా త్వరగా మెత్తబడుతుంది.
- కొందరిలో రక్తనాళాలు చక్కగానే వుండి పురుషాంగంలోకి రక్తం చక్కగా ప్రసరిస్తుంది. ఇంట్రాకేవర్నస్ పెపావరిన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే అంగం చక్కగా గట్టిపడుతుంది. అయినా మూడు- నాలుగు నిమిషాల్లో అంగం మెత్తబడిపోతుంది. ఇటువంటి పరిస్థితిని వీనస్ లీకేజ్గా తీసుకోవచ్చు.
- ఇంట్రాకేవర్నస్ పెపావరిన్ ఇంజక్షన్ నేరుగా పురుషాంగానికి ఇంజక్షన్ ఇచ్చే పద్ధతి. ఇది హనికరం కాదు. అరుదుగా కొందరిలో అలా స్తంభించిన పురుషాంగం గంటల తరబడి వుండి ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినవారికి ఫినైలెఫ్రిన్తో చికిత్స చేయడం జరుగుతుంది.
కొలెస్టరాల్ శాతం ఎక్కువ వున్న వారిలో, మధుమేహం వున్నవారిలో, ధూమపానంచేసేవారిలో రక్తనాళాలు గట్టిపడి, సన్నబడి రక్తప్రసారం తగ్గి సెక్స్లో అసమర్ధత కలగవచ్చు.అందుకని మధుమేహన్ని పూర్తిగా అదుపులో వుంచుకోవాలి. కొలెస్టరాల్ పెరగకుండా ఆహరంలో జాగ్రత్త పడాలి. ధూమపానం మానివేయాలి.
- రక్తప్రసరణని అంచనా వేయడానికి వాడే ‘ఇంట్రాకేవర్నస్ పపావరిన్’ ఇంజక్షన్ని అంగస్తంభన లేనివారలో డాక్టర్ సలహ మేరకు ఎవరికి వారు ఇంజక్షన్ చేసుకుని సెక్స్లో పాల్గొనే చికిత్సా పద్ధతి కూడా వుంది.
అధిక సంఖ్యాక షుగర్ రోగుల్లో షుగర్ వ్యాధివల్ల పది నుంచి ఇరవై శాతం మాత్రమే బలహీనత ఏర్పడుతుంది. ఈ తేడావల్ల అంగం స్తంభించడంలో, గట్టిపడడంలో కొద్దిగా ఆలస్యం కలగవచ్చు. ఒకసారి అంగస్తంభన కలిగిన తరువాత అంతా మామూలుగా సక్ర మంగానే వుంటుంది.
షుగర్వ్యాధి వల్ల అంగం స్తంభించకపోవడానికి ఆ వ్యాధివల్ల శరీరంలోని తక్కిన రక్త నాళాలులాగానే పురుషాంగంలో రక్తనాళాలు కూడా గట్టిగా మారతాయి. గుండె రక్తాన్ని పంపు చేసినప్పుడల్లా పూర్తిగా వ్యాకోచించడం వుండదు. దానివల్ల పురుషాంగంలోని కావర్నస్ సైనస్లోకి రక్తం నిండుగా చేరడం వుండదు. పురుషాంగంలోకి రక్తం పూర్తిగా చేరకపోతే అంగం గట్టిపడడం జరగదు. అది అలా వుండగా షుగర్ వ్యాధి వల్ల పురుషాంగంలోని అతిపల్చని కండరాలు సాగకుండాపోతాయి.
- షుగర్ వ్యాధి వల్ల పురుషాంగంలోని అతి సున్నిత నరాలు మొద్దుబారుతాయి. అవి మెదడు నుంచి వచ్చే సంకేతానికిగానీ, ఇతరత్రా శరీరంలో కలిగే ప్రేరణలనిగానీ పొంది ఉత్తేజం పొందవు. అవి మొద్దుబారడంతో పురుషాంగంలోని రక్తనాళాలని, రక్తం చేరే గదులని వ్యాకోచించేటట్లు ప్రేరేపించలేకపోతాయి.మెదడులో తయారయ్యే ఒక విధమైన న్యూరోట్రాన్స్మీటర్స్ సెక్స్ ప్రేరకాలుగా పనిచేస్తాయి. షుగర్ వ్యాధి వచ్చిన వారిలో ఈ న్యూరోట్రాన్స్మీటర్స్ తగ్గిపోతాయి. దానివల పురుషాంగం సరిగ్గా స్తంభించదు.షుగర్ వ్యాధి వున్న వారిలో సెక్స్లో వైఫల్యం కలుగుతున్నప్పుడు నిజంగానే నరాలు మొద్దుబారాయా, రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసారం తగ్గిపోయిందా అని తెలుసుకోవడానికి సింపుల్ అబ్జర్వేషన్ చాలు. నిద్రపోతున్నప్పుడుగానీ, తెల్లవారుఝామునగానీ అంగం గట్టిపడి నిలబడుతోందా లేదా అనేది స్త్రీ పరిశీలించాలి. అంగం గట్టిపడటం వుంటే, సెక్స్లో వైఫల్య మనేది షుగర్ వ్యాధి వల్ల మనసులో కలిగిన దిగులువల్లనే అని తెలుసుకోవాలి. ఆ దిగులు వదలడానికి తగినంత కృషి చేయాలి.డాప్లర్ టెస్ట్
- పురుషాంగంలో పపావరిన్ ఇంజక్షన్ ఇచ్చినా అంగం స్తంభించేదీ లేనిదీ తెలుస్తుంది. పెనైల్ యాంజియోగ్రఫీ, కావర్నసోగ్రఫీ వంటి పరీక్షలు కూడా ఇందుకు తోడ్పడుతాయి.
షుగర్ వ్యాధి ఇన్సులిన్ ఇంజక్షన్కే తగ్గుతుందా, మాత్రలతో తగ్గుతుందా నిర్ధారణ చేసుకుని ఆ రకంగా పూర్తి మోతాదులో మందు వాడి వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకు రావాలి. బ్లడ్ షుగర్ని ఎప్పుడూ నార్మల్గా వుండేటట్లు చూడాలి. షుగర్ పెరగకుండాజాగ్రత్తపడాలి.
- షుగర్వల్ల నరాలు,రక్తనాళాలు బాగా దెబ్బతిన్నట్లయితే షుగర్ని ఎంత అదుపు చేసినాసెక్సువల్ పవర్ పూర్తిగా నార్మల్కి రావడం వుండదు. అంగం పూర్తిగా గట్టిపడడం జరగదు. అయినా వీరుకూడా సెక్స్లో తృప్తికరంగా పాల్గొనేటట్లు, స్త్రీకి సెక్స్ తృప్తి కలిగేటట్లు చేయవచ్చు.
- సెక్స్లో పాల్గొనే ప్రతీసారీ ఇంట్రాకేవర్నస్ పపావరిన్ ఇంజక్షన్ చేసుకుంటే అంగం గట్టిపడి సెక్స్లో పాల్గొనడం సాధ్యమవుతుంది.
- ఎరక్ ఎయిడ్ సిస్టం సహకారంతో కూడా అంగం గట్టిపడేటట్లు చేసుకోవచ్చు. అలాకూడా సెక్స్లో పాల్గొనవచ్చు.
- పెనైల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం వల్ల కూడా సెక్స్ సాధ్యమవుతుంది.ఈ స్థితిదాకా రాకుండా షుగర్ వ్యాధి మొదటి దశలోనే గుర్తించి జాగ్రత్త తీసుకుంటే సెక్స్ని జీవితకాలం ఎంజాయ్ చేయవచ్చు.
దెప్పి పొడుపులతో పచ్చని సంసారాన్ని బజారుపాలు చేసుకునే దంపతులు
స్త్రీలైనా పురుషులైనా చిన్నతనం నుంచి ఎవరికి వారు ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని విశిష్టతని సంతరించుకుంటారు. పెంపకం ప్రభావం కూడా వారి మీద ఉంటుంది. ఎప్పటికీ ఒకరిని మరొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరగదు. అయితే భార్యాభర్తల మధ్య కలతలు రాకుండా ఉండాలంటే మనసులు కలిసిన విషయాలకి ఆనందించటం, భిన్న దృక్పధంలో ఉన్న విషయాలని అభిమానించటం చేయాలి. ఎదుటివారిలో లోపాలు ఎత్తి చూపడంగాక వారిలో ఉన్న సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య కలహలకి చోటు లేకుండా పోయి ఆనందం వెల్లివిరుస్తుంది. వారి వ్యక్తిత్వాల్లో అభ్యుదయం కనబడుతుంది.

