
నీ బాధను నేను అర్థం చేసు కోగలను. అయితే ఒక్క అమ్మాయి మిమ్మల్ని కాదన్నంత మాత్రాన ఇక ప్రపంచంలో అమ్మాయి లందరూ నల్లగా ఉండేవారిని ప్రేమించరనే సందేహా ల నుంచి బయటకు రండి. సాధారణంగా మనకు ఎదురైన అనుభవాలను మనం మూడు రకాలుగా ఫిల్టర్ చేస్తాం. అవి డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. ఇప్పటివరకు మీతో చాలామంది స్నేహం చేసి ఉంటారు. వారికి మీ రంగు అడ్డుకాలేదే. కాని మీరా విషయాన్ని మనసునుంచి డిలీట్ చేశారు. మీకు ఎదురైన ఒక అనుభవాన్ని ‘జనరలైజ్’ చేసి అదే నిజమని నమ్ముతున్నారు. దాన్నుంచి బయటకు రండి. నల్లగా ఉన్నవారిని కూడా కోరి వరించిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. తెలుగు సినిమా కామెడీయన్ బాబూమోహన్ గారిది లవ్ మ్యారేజ్ అనే విషయం మీకు తెలుసా?

