పిల్లలు పుట్టనివారి విషయంలో సాధారణంగా భర్తకి వీర్యం పరీక్ష, భార్యకి డి అండ్ సి, హిస్టోపథంలాజికల్ ఎగ్జామినేషన్, హిస్ట్రోసాల్పింగో గ్రామ్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా లోపం ఏదైనదీ తెలుస్తుంది.

కొందరికి పై పరీక్షల్లో సరైన లోపం కనబడదు. అటువంటప్పుడు హార్మోన్ టెస్టులు, ఇతర టెస్టులు చేయవలసి వుంటాయి. అండం విడుదలలేని స్త్రీలలో ‘ఫెర్టయిల్’  వంటి బిళ్ళలు ఒక క్రమపద్ధతిలో వాడటం, అవసరం బట్టి హార్మోన్ టెస్టులు, ఇతర టెస్టులు చేయవలసి వుటాంయి. అవసరం బట్టి హార్మోన్ ఇంజక్షన్లు వాడటం జరుగుతుంది. దానివల్ల అండం విడుదలై గర్భం వస్తుంది.

పురుషుల విషయంలో కూడ వీర్య కణాలు తగినన్ని లేకపోయినా, జీవం లేకపోయినా ఫెర్టయిల్ విం బిళ్ళలు, హార్మోన్ ఇంజక్షన్లు వాడవలసి వుంటుంది. కొందరు పురుషులకి వేరికోసిల్ వల్ల వీర్యకణాల సంఖ్య దెబ్బతింటుంది. వారికి వేరికోసీల్ ఆపరేషన్ చేసి లోపాన్ని సరిదిద్దాలి.

Share.
Leave A Reply

Exit mobile version