
ఇది వీర్య కణాల రక్షణకు తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా వారు యువకులపై తాజాగా అధ్యయనం చేశారు. వారానికి 15 గంటల పాటు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామం చేసినవారిలో వీర్యం చిక్కదనం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అలాగే టీవీ చూడని వారితో పోలిస్తే వారానికి 20 గంటల పాటు టీవీ ముందు గడిపే యువకుల్లో వీర్యకణాల సంఖ్య సుమారు సగం వరకు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వీర్యకణాల చురుకుదనం, వాటి ఆకారం విషయంలో మాత్రం మార్పులేవీ కనబడలేదని వివరిస్తున్నారు.
కేవలం ఈ ఫలితాల ఆధారంగా వ్యాయామంతో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఇతరత్రా లాభాలు చాలా ఉంటాయి కాబట్టి వేగంగా నడవటం, పరుగు, సైకిల్ తొక్కటం, ఈత వంటివి చేయటం మంచిదని సూచిస్తున్నారు.

