కావలసినవి :


సగ్గుబియ్యం – అర కేజీ; టొమాటోలు – 200 గ్రా; నీళ్లు – 6 కప్పులు;  కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ 

  •  టొమాటోలను శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో సుమారు పావు గంటసేపు ఉడికించాలి 
  • చల్లారాక పైన తొక్కు తీసి ప్యూరీలా చేసి పక్కన ఉంచాలి 
  •  సగ్గుబియ్యాన్ని సుమారు పావుగంటసేపు నానబెట్టి నీళ్లు ఒంపేయాలి
  • ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి సగ్గుబియ్యం చల్లారాక, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి 
  • ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద, ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని స్పూన్తో తీసుకుని వడియా లుగా పెట్టాలి 
  • కొద్దిగా ఎండాక ప్లాస్టిక్ కవర్ నుంచి వేరు చేసి పళ్లెంలో నాలుగైదు రోజులు ఎండబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
Share.
Leave A Reply

Exit mobile version