కావలసినవి
గోధుమలు
ఒకటిన్నర కప్పులు, మినప్పప్పుముప్పావు కప్పు,
బఠాణీ
పావు కప్పు, క్యారట్ తురుము పావు కప్పు,
బీన్స్
తరుగు
పావు కప్పు, పెరుగుఅర కప్పు, కొత్తిమీర
కొద్దిగా, కరివేపాకురెండు రెమ్మలు,
ఆవాలు
టీ స్పూను, మినప్పప్పు (బద్దలు) – 2 టీ స్పూన్లు,
శనగపప్పు
– 2 టీ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి తరుగురెండు టీ స్పూన్లు, ఉప్పుతగినంత, నూనెతగినంత
 తయారి
 గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి.  మిన ప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి.  గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి. మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి,
గోధుమరవ్వ,
ఉప్పు
వేసి
బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి. బాణలిలో నూనె కాగాక,
ఆవాలు,
మినప్పప్పు,
శనగపప్పు,
అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ? క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి. నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర,
కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇడ్లీ రేకు లలో వేసి కుకర్లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.

Share.
Leave A Reply

Exit mobile version