కావల్సినవి:
గుడ్లు – మూడు, బ్రెడ్స్త్లెసులు – ఆరు, నూనె – మూడుచెంచాలు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు, టొమాటో సాస్ – అరకప్పు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, కొత్తిమీర – కట్ట.
తయారీ:
కోడిగుడ్లను ఉడకబెట్టుకుని పెంకు తీసుకుని రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న పచ్చసొనను తీసేయాలి. ఉల్లిపాయలూ, పచ్చిమిర్చీ, కొత్తిమీరను సన్నగా తరిగిపెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్త్లెసుని కూడా గుండ్రంగా వచ్చేలా కోసి.. రెండువైపులా ఉప్పూ, మిరియాలపొడీ వేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. ఒకదానిపైన ఉల్లిపాయముక్కలూ, కొద్దిగా టొమాటోసాస్, పచ్చిమిర్చి ముక్కలూ, కొద్దిగా కొత్తిమీర చల్లి ఎగ్ముక్కను బోర్లించినట్లుగా స్త్లెసులోకి జాగ్రత్తగా దూర్చినట్లు నొక్కాలి. ఇలా మిగిలిన స్త్లెసుల్ని కూడా చేసుకోవాలి. వీటిని పెనంపై ఉంచి కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది.


