కావలసినవి :
మామిడికాయ ముక్కలుకిలో; నువ్వులుపావు కిలో, ఉప్పుపావు కిలో; నువ్వుల పొడిఅర కిలో; అల్లం వెల్లుల్లి ముద్దపావు కిలో; ఆవ పొడి – 50 గ్రా., పసుపుటీ స్పూను; జీలకర్ర పొడి – 25 గ్రా., మెంతి పొడిటేబుల్ స్పూనుఇంగువచిటికెడు; ఆవాలు, జీలకర్రఒకటిన్నర టీస్పూన్లు

తయారీ :
మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి. వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయూలి. నూనె చల్లారి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి (ఇలా చేయడం వల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది). పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలపాలి. అన్నిముక్కలకూమసాలా పట్టిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూత పెట్టాలి. మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు. ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.
Share.
Leave A Reply

Exit mobile version