కావలసినవి

బంగాళాదుంపలు – 4
పంచదార – 100గ్రా
యాలకులు – 4
పాలకోవా – ఒక
కప్పు
నెయ్యి – 100గ్రా.
పచ్చకర్పూరం – కొద్దిగా
తయారుచేసే
విధానం
బంగాళాదుంపలు
కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తరువాత తొక్కలు వొలిచి
మెత్తగా రుబ్బాలి. ఈ రుబ్బిన ముద్దను ఒక గరిటె నెయ్యి వేసి వేయించుకోవాలి.
పాలకోవాను ముందుగా తయారుచేసుకోవాలి. వేయించిన దుంపల ముద్దలో పాలకోవా వేసి కలిపి
ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పంచదార వేసి
, నీళ్లు కొద్దిగా పోసి తీగపాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి, తరువాత రెండూ కలిపి
ఉంచుకున్న ముద్దను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా
వేసి బాగా కలిపి
, యాలకుల
పొడి
, పచ్చకర్పూరం
కూడా వేసి బాగా కలపాలి. మూత ఉంచి అరగంట తరువాత తియ్యాలి. ఇది చాలా బాగుంటుంది.
వెరైటీగా కూడా ఉంటుంది

Share.
Leave A Reply

Exit mobile version