• రోజుకి 8-10 గ్లాసులు నీళ్ళు తాగండి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరంలోని మలినలు, వ్యాధి కారక క్రిములు బయటకు పోతాయి.
  • రోజూ మీ ముఖాన్ని 2-3 సార్లు ఒక మంచి ఫేస్ వాష్తో శుబ్రం చేసుకోండి, ఎక్కువగా చేసుకోవడం మంచిది కాదు.
  • సహజమైన స్క్రబ్స్  ఉపయోగించి మీ చర్మాన్ని వారానికి 2-3 సార్లు శుభ్ర పరచుకుండి. దీని వల్ల చనిపొయిన చర్మ కణాలు తొలగిపొయి, కొత్త కణాలు వస్తాయి.
  • వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు, దాని వల్ల చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ.
  • ఎక్కువగా మీ ముఖమును, చేతులతో తాకవద్దు, ఎందుకంటే మీ చేతులకు ఉన్న మురికి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • సాద్యమైనంతవరకు సహజంగానే ఉండండి, కాస్మటిక్స్ వాడకం తగ్గించడం ఎంతో అవసరం.
  • మీ చర్మము జిడ్డుగల చర్మం అయితే ఎక్కువగా పౌడర్ రాయడం మంచిది.
  • కాలనికి అనుగుణంగా మీ క్రీంలు, సబ్బులు మర్చడం ఎంతో అవసరం.       
  • ఒక చిన్న కలబంద తీసుకుని, దాని రసాన్ని ముఖానికి పట్టించండి, ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గర్లో ఉన్న షాపులో దొరికే కలబంద జాల్ లేదా జ్యౌస్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి సహజమైన కలబంద లాగానే ఉపయోగపడతాయి, వీటితో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
  • మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లి తీసుకోండి, వెల్లుల్లి  చర్మంలోని కణాల కాలాన్ని పెంచి, చర్మాన్ని ఎంతో తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.
  • నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెంటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు.
  • రోజు లేత కొబ్బరి కాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది.
  • రోజు నారింజ రసం తాగడం ఎంతో మంచిది,వీటిలో “C” విటమిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల, అవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా, మరియు యవ్వనంగా ఉంచుతాయి.

Share.
Leave A Reply

Exit mobile version