• మీరు ప్రశాంతముగా, సంతోషముగా ఉంటే మీ శిశువు కూడా అలాగే ఉంటుంది .
  • ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూరలు,  పప్పు, మాంసము, చేపలు వంటి బలవర్ధక మైన ఆహరం తీసుకోవాలి.
  • డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి. స్వంతంగా మందులు వాడకూడదు.
  • అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది. గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
  • పొగత్రాగేవారికి, మధ్యపానము చేసే వారికి దూరంగా ఉండండి,
  • Tips for  Pregnants
  • ఎక్స్-రే తీయించుకోవడం వంటివి చేయకండి.
మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.
  • ఎత్తు మడమల చెప్పులు వాడకండి.
  • కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.
  • బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.
  • మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు, ఈ క్రింది పేర్కొన్నవి చేయవద్దు :

  1.  దూర ప్రయాణము
  2.  కారు, స్కూటర్ నడపడం.
  3.  అతిగా సంభోగము 

  • నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది.
  • సుఖప్రసవానికి – బ్రీతింగ్ వ్యాయామాలు, శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి.
  • క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 – 10 గంటలు, మధ్యాహ్నం 1 గంట అవసరము.
  • ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి.
  • కుటుంబ నియంత్రణ సలహా కొరకు ప్రసవమైన 6 వారాల తర్వాత డాక్టర్ ని సంప్రదించండి.
ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
  1.  రక్తస్రావము
  2.  ఉమ్మనీరు పోవడం
  3. శిశువు కదలిక తగ్గినట్టుగాని, ఆగినట్టుగాని అనిపించినపుడు
  4. నొప్పులు రావడం
 
Share.
Leave A Reply

Exit mobile version