Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » త్వరలో దేశమంతా ఈ పాస్ పోర్టు .
జాతీయం

త్వరలో దేశమంతా ఈ పాస్ పోర్టు .

apanalysisBy apanalysisMay 17, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

భధ్రత, డేటా సంరక్షణ  లక్ష్యంతో కొత్త విధానం

ఏపీ స్టేట్ బ్యూరో,

పాస్ పోర్టుల భధ్రత, పరిరక్ష్లణ, నకిలీ, టాంపరింగ్ ల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్ ఫోర్టు విధానాన్ని అమలులోకి తీసుకువస్తుంది. దేశంలోని అన్ని పాస్ పోర్టు కేంధ్రాల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రాం (PSP) 2.0 ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా ఎలక్ట్రానిక్‌ పాస్‌పోర్ట్‌ (e-Passport) ప్రవేశపెట్టింది. భారతీయుల ప్రయాణాన్ని మరింత మెరుగుపరచడం, పాస్‌పోర్ట్‌ భద్రతను కల్పించడంలో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం పాస్‌పోర్టులు పేపర్‌ ప్రింటింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్‌ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్‌ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్‌ నుంచి పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత డేటాను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం.

ఈ-పాప్‌పోర్ట్‌ ఏంటంటే?

ఇది సంప్రదాయ పేపర్‌ డాక్యుమెంట్‌ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్‌ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్‌ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (Radio-Frequency Identification – RFID) టెక్నాలజీతో ఈ-పాస్‌పోర్ట్‌ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్‌ కవర్‌లో చిప్‌, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్‌ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఈ-పాప్‌పోర్ట్‌ ద్వారా అథెంటికేషన్‌ సులభతరం అవుతుంది.

ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే..

ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌ సేవలు హైదరాబాద్‌ సహా 13 నగరాల్లో (నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్‌, అమృత్‌సర్‌, జైపూర్‌, చెన్నై, సూరత్‌, రాంచీ, ఢిల్లీ) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది ప్రథమార్థం ముగిసే నాటికి దేశంలోని అన్ని పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లో ఈ-పాస్‌పోర్ట్‌ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇప్పటికే పాస్‌పోర్ట్‌ ఉన్నవారు కచ్చితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పాస్‌పోర్ట్‌లు వాటి ఎక్స్‌పైరీ డేట్‌ వరకు సేవలందిస్తాయి. ఈ-పాస్‌పోర్ట్‌ అప్‌గ్రేడ్‌ అనేది ఆప్షనల్‌ మాత్రమే.

ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే చెన్నై, నాగ్‌పూర్, హైదరాబాద్, జైపూర్ మరియు ఇతర నగరాల్లోని ఎంపిక చేసిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSK) లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల (RPO) నుంచి కూడా పొందొచ్చు.

Post Views: 176
data protection To prevent duplicate
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు

March 24, 2026

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌! .. టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

March 24, 2026

ఆశావాహుల‌కు గుడ్ న్యూస్‌.. పెరగ‌నున్న అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాలు

March 24, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.