Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » మహానాడులో అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు-డీజీపీ
క్రీడలు

మహానాడులో అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు-డీజీపీ

apanalysisBy apanalysisMay 24, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు ఆదేశాలు

‘మహానాడు పై సమీక్ష

ఏపీ స్టేట్ బ్యూరో,

కడప మే 24: ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న ‘మహానాడు’ సందర్బంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీ.జీ.పీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీ.జీ.పీ హరీష్ కుమార్ గుప్తా పలు అంశాలపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘మహానాడు’ కు పలువురు వి.వి.ఐ.పి లు, వి.ఐ.పి లు, పెద్ద ఎత్తున ప్రజలు   రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పార్కింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల  ద్వారా వెళ్లేలా మళ్లించాలని ఆదేశించారు.  పకడ్బందీగా రూట్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  పోలీస్  అధికారులకు కేటాయించిన విధులను అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించాలన్నారు.  సమావేశంలో అడిషనల్ డి.జి (లా అండ్ ఆర్డర్)  ఎన్.మధుసూదన్ రెడ్డి ఐ.పి.ఎస్ , కర్నూలు రేంజ్ డి.ఐ.జి  డా.కోయ ప్రవీణ్, అనంతపురము రేంజ్ డి.ఐ.జి డా.షెముషి బాజ్ పేయి, కడప జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్, కర్నూలు జిల్లా ఎస్.పి శ్రీ విక్రాంత్ పాటిల్ , అన్నమయ్య జిల్లా ఎస్.పి శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, నంద్యాల జిల్లా ఎస్.పి శ్రీ అధిరాజ్ సింగ్ రాణా, అనంతపురం జిల్లా ఎస్.పి శ్రీ పి.జగదీశ్, గుంతకల్ రైల్వే ఎస్.పి శ్రీ రాహుల్ మీనా, అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు గారు తదితర పోలీసు ఉన్నతాధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

Post Views: 36
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

పిల్లిమొగ్గల రియల్

October 25, 2025

సోషల్ మీడియాతో జర జాగ్రత్త .

October 18, 2025

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో

July 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.