ఏపీ స్టేట్ బ్యూరో.
రాష్ట్రానికి చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరిగింది. ఇన్‌చార్జ్ డీజీపీగా ఉన్న హరీశ్‌కుమార్ గుప్తాని పూర్తి స్థాయి డీజీపీగా నియమించేందుకు యూపీఎస్సీ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో జాబితాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ జాబితాలో హరీశ్ కుమార్ గుప్తా, అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరీశ్ కుమార్ గుప్తాను ఇన్‌చార్జి డీజీపీగా కూటమి ప్రభుత్వం నియమించింది. పని తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. రిటైర్‌మెంట్ వయసుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు ఈ పదవిలో హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతారు.
