లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్
పొన్నూరు ఎమ్మేల్యే ప్రతిపాదన
ఏపీస్టేట్ బ్యూరో,
తెలుగుదేశం పార్టీ పగ్గాలు యువ నాయకుడు నారా లోకేష్ కు అప్పగించాలే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే టిడిపి లీడర్లు, క్యాడర్ లోకేష్ కు మరింత ఉన్నతస్థానం కల్పించాలని అధినేత చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. తాజాగా కడపలో జరుగుతున్న టిడిపి మహానాడులో పలువురు నాయకులు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనే ప్రతిపాదనలు చంద్రబాబు ముందుంచుతున్నారు.

కడప మహానాడులో రెండోరోజు గుంటూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రసంగించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో నాయకులు వ్యక్తపర్చిన అభిప్రాయాన్ని చంద్రబాబు ముందుంచారు. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపిన ధూళిపాళ్ల దీన్ని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పరిశీలించాలని కోరారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలనా వ్యవహరాలు చూసుకుంటే లోకేష్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని… అందుకే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని లీడర్లు, క్యాడర్ కోరుతోంది.
ఇదే అభిప్రాయాన్ని ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యక్తం చేసారు. లోకేష్ ను టిడిపి పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కోరుకుంటున్నామని… దీన్ని మహానాడు వేదికగా చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని అన్నారు.
