5వ తేదీ నుండి 8వ తేదీ వరకు
బందరు బీచ్ లో జాతీయస్థాయి పండుగ ….
పది లక్షల మంది తిలకించేందుకు ఏర్పాట్లు ….
అతిథులుగా సీఎం ,డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు రాక …
వివరాలు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర…..
ఏపీ స్టేట్ బ్యూరో,
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ లో జాతీయస్థాయి పండుగ నిర్వహించనున్నారు. దీనిని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 5 నుంచి 8 వరకు నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. దాదాపు పది లక్షల మంది పాలుపంచుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. వీటి వివరాలను మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
ఈ పోటీల కోసం 24 రాష్ట్రాల నుండిజాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తరలి రానున్నారు. బీచ్ ఫెస్టివల్ కు ఒక రోజు ముందుగా 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ 24 రాష్ట్రాల నుండి 2వేల మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు రానున్నారని తెలిపారు. వీరికి అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వీటితోపాటు ఎమ్యూజ్ మెంట్, ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశామన్నారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరిస్తామన్నారు. వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభిస్తామన్నారు. 6వ తేదీ సాయంత్రం నుండి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.
తెలుగు వారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే భారతదేశంలో ప్రత్యేకమైన రుచులతో కూడిన ఆహార పదార్థాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడు జోన్లలో ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నారు. ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వన్ వే ట్రాఫిక్ ను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సముద్ర స్నానాలకు వెళ్లే వారికి మెరైన్ అధికారులు సహకారంఅందిస్తున్నారన్నారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించవచ్చని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరారు. పర్యాటక కార్యక్రమంగా మాత్రమే కాకుండా సరికొత్త ఆవిష్కరణలకు, అవకాశాలకు కేంద్రంగా మసులా బీచ్ ఫెస్టివల్ మారబోతుందని మంత్రి రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మెప్మా పిడి సాయిబాబు తదర అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.
