బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నది. వీటిని మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
-ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరియు ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం రూ.575.75 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మరియు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్ ఆధారిత విధానంలో 15 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు రూ.822.86 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
– ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన పదిహేడు (17) మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.03. హోం శాఖ:
– APSPFలో 248 కానిస్టేబుల్లను హెడ్ కానిస్టేబుల్లుగా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ల సంఖ్యను 248 కి తగ్గించడానికి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-YSR జిల్లా పేరును YSR కడప జిల్లాగా మార్చడానికి రెవిన్యూ (ల్యాండ్స్) శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా, అగిరిపల్లి మండలం, పిన్నమరెడ్డి పల్లి గ్రామంలోని మరియు నూగొండపల్లి గ్రామంలోని మొత్తం 94.497 సెంట్ల ప్రభుత్వ భూమిని హోం శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి మండలి ఆమోదం తెల్పింది.
