జోగి…
యుటర్నా
ధిక్కార స్వరమా?
ఏపీ స్టేట్ బ్యూరో,
మాజీ మంత్రి జోగి రమేష్ స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ సాహసించరు. ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వరు. అయితే ఆదివారం నాటి జోగి స్టేట్ మెంట్ ఎటు నుంచి ఎటువైపునకు పరిస్ధితులు దారితీస్తాయో చూడాలి మరి. ఆ వివరాలు ఇవి. ఇక చదవండి.
వైసీపీ ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం.. మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని మా నేత జగన్ దృష్టికి తీసుకెళ్తాం.. చివరికి మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే జగన్ 3 రాజధానుల నిర్ణయం.. మళ్లీ జగన్ సీఎం అయ్యాక అమరావతి రాజధాని నిర్మాణం చేస్తారు. చంద్రబాబు కూడా మేం చెప్పినట్టే విశాఖ ఆర్థిక రాజధాని అంటున్నారు.
