Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » పీవోకే ఇస్తేనే నీళ్ళు
జాతీయం

పీవోకే ఇస్తేనే నీళ్ళు

apanalysisBy apanalysisJune 8, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దిగువకు నీళ్లు వెళ్లకుండా ఆపేసింది. మా నీళ్లు ఎవరూ ఆపలేరని ఈ ఒప్పందాన్ని రద్దు చేసినపుడు పాకిస్తాన్ లోని రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వరుసగా లేఖలు రాస్తోంది. దాహం వేస్తోంది.. మంచినీళ్లు ఇవ్వండి ప్లీజ్ అంటోంది. మిత్రుడు చైనాతో కలిసి బెదిరింపులకు పాల్పడుతోంది. బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు ఇచ్చేస్తేనే.. పాకిస్తాన్‌కు నీళ్లు ఇవ్వాలన్న పట్టుదలతో భారత్ ఉంది. భారత్ సింధూ జలాలు దిగువకు వెళ్లకుండా ఆపేయడంతో పాకిస్తాన్ లో దుర్బర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనీసం సగం వ్యవసాయంపై ప్రభావం పడుతోంది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పలు నగరాల్లో దాహార్తి కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో సిగ్గు విడిచి పాకిస్తాన్ భారత్ ను వేడుకుంటోంది. నీరు విడుదల చేయాలని ఇప్పటికి మూడు సార్లు లేఖలు రాశారు. అయినాకేంద్రం కఠినంగా వ్వహరిస్తోంది. ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకూ.. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవని ప్రధాని మోదీ ఖరాఖండిగా చెబుతున్నారు.

చైనాతో కలిసి బెదిరింపులు

చైనా నుంచి భారత్ లోకి వచ్చే బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని పాకిస్తాన్ బెదిరిస్తోంది. చైనా కూడా ఆ బెదిరింపులకు మద్దతు పలుకుతోంది. తాము బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. ఇప్పటికే ఆ నదిని ఆపడానికి చైనా చేయాల్సినదంతా చేస్తోంది. భూటాన్ వద్ద అతి పెద్ద డ్యాం నిర్మిస్తోంది. కొత్తగా చైనా ఆపేదేం లేదు. బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేసినా.. సమస్యలు రాకుండా చూసుకునేలా భారత్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకే ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

పీవోకే తిరిగి ఇస్తేనే నీళ్లు

కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో కలసిపోతుందని ప్రకటిస్తున్నారు. యుద్ధం ఆపేశారు కదా ఎలా సాధ్యమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బుల్లెట్లు, బాంబులు, మిస్సైళ్లతో జరిగే యుద్ధమే ఆగిపోయింది. పాకిస్తాన్ పై అసలైన యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధంలో ఓడించి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటారు. ఆ యుద్ధంలో అసలైన బాంబు నీళ్లే. సింధూ జలాలు కావాలంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించి అక్కడ ఉగ్రవాదం లేకుండా చేస్తేనే పాకిస్తాన్‌కు నీళ్లు అందుతాయి. లేకపోతే సగం పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది.. ఆ ప్రాంతాల్లోని ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేస్తారు.

Post Views: 161
after pok sindhu water to pakistan water bomb war to pakistan
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు

March 24, 2026

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌! .. టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

March 24, 2026

ఆశావాహుల‌కు గుడ్ న్యూస్‌.. పెరగ‌నున్న అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాలు

March 24, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.