విజయవాడ-గుంటూరు
ఏపీ ఎనాలిసిస్, మంగళగిరి
విజయవాడ, గుంటూరు మధ్య ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మంగళగిరికి 50, గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం MTMC కేంద్రంగా 7 మెగావాట్ల సామర్థ్యంతో ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. విద్యుత్ సరఫరా చేస్తోంది. గంటూరు జిల్లా పాతూరులో 1.8 మెగావాట్ల సామర్థ్యంతో ఒక ప్రైవేటు సంస్థ 60 బస్సులకు ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యంతో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా కాజాలో 3 కేంద్రాలు ఉన్నాయి.. ఇక్కడ ఒక్కో కేంద్రంలో 250 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. కుంచనపల్లిలో 2, ఆత్మకూరులో 1, పెదవడ్లపూడిలో ఒక కేంద్రాలను ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెండు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.. మిగిలినవి కూడా పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఛార్జింగ్ గన్‌కు 45 కిలోవాట్ల సామర్థ్యం ఉండగా.. ఈ మేరకు అక్కడ అవసరానికి తగ్గట్టుగా మరికొన్ని గన్‌లను ఏర్పాటు చేసుకుంటారు. అమరావతిలో రాజధాని పనులు చేస్తున్న మరో కంపెనీ కూడా కృష్ణాయపాలెంలో ఛార్జింగ్ సెంటర్ కావాలని దరఖాస్తు చేసుకుంది. ఛార్జింగ్ చేయడానికి యూనిట్‌కు రూ.7 మాత్రమే వసూలు చేస్తోంది. ఎంత వాడుకున్నా యూనిట్‌కు రూ.7 మాత్రమే వసూలు చేస్తారు.మంగళగిరికి మొదటి దశలో ఆర్టీసీ 50 బస్సులు రానున్నాయి.. గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. ఆ తర్వాత మెల్లిగా వీటి సంఖ్య పెరగనుంది. అటు గుంటూరు డిపోకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.
