Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » చదువు
ఆంధ్రప్రదేశ్

చదువు

apanalysisBy apanalysisJune 18, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చదువుకు చేయూత…

ఇంటర్ విద్యార్థినికి ప్రోత్సాహం…

లంకి శెట్టి బాలాజీ ప్రెండ్ సర్కిల్ ద్వారా లక్షా 58 వేల నగదు బహుమానం…

ఏపీ ఎనాలిసిస్, మచిలీపట్నం

             చదువుకు చేయూతనిచ్చే కార్యక్రమం బుధవారం ప్రముఖ న్యాయవాది మచిలీపట్నం భారసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకి శెట్టి బాలాజీ కార్యాలయంలో జరిగింది .ఇంటర్ విద్యార్థిని ని  ప్రోత్సహిస్తూ లంకె శెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా 1,58 వేల రూపాయల నగదు అందజేశారు. మచిలీపట్నం లోని  భాష్యం  హైస్కూల్లో చదివిన చినముత్తేవి శ్రీలక్ష్మి నాగ మృదుల పదవ తరగతిలో 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించింది.ప్రస్తుతం  ఈమె విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ బైపిసి  చదువుతుంది . ఇంటర్ మొదటి సంవత్సరంలో 440 మార్కులు గాను 430 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి వచ్చిన ఆమెకు లంకి శెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా లక్షా 58 వేల రూపాయల నగదును బుధవారం సాయంత్రం అందజేశారు .గత ఏడాది ఇదే విద్యార్థినికి లక్షా 35 వేల రూపాయలు నగదు బహుమతిని బాలాజీ ప్రెండ్ సర్కిల్ ద్వారా అందచేయడం  జరిగింది .ఈ సందర్భంగా  న్యాయవాది లంకి శెట్టి బాలాజీ మాట్లాడుతూ  డాక్టర్ కావాలనే లక్ష్యంతో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని మృదుల ఆశయం చాలా గొప్పదన్నారు .డాక్టర్ గా ఆర్మీలో  సేవలందించాలనే  ఆమె  ఆశయం ఆదర్శనీయమన్నారు. ఆమె చదువుకు పేదరికం ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో తమ  సర్కిల్ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. రెండేళ్లుగా ఈ సహాయాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన దాతలకు బాలాజీ ధన్యవాదాలు తెలిపారు .ముఖ్యంగా రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శాయన సుశీలరావు తన తల్లిదండ్రుల మీద ఏర్పాటు చేసిన సేవా సమితి ద్వారా విద్యార్థులకు చేస్తున్న సహాయం వెలకట్టలేనిదన్నారు. అదే స్ఫూర్తితో ఈ విద్యార్థికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సుశీలరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లంంగిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మృదులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాయన సుశీలరావు, ఎస్ బి ఐ రిటైర్డ్ ఏజీఎం ఎల్ ఎస్ ఎస్ వి డి హనుమంతరావు, ఎల్ సాయిబాబు ,సిహెచ్ ఆదినారాయణ ,విద్యార్థిని తండ్రి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 60
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

April 1, 2026

నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

March 24, 2026

రాష్ట్రంలో పెద్దఎత్తున తాగునీటి ప్రాజెక్టుల పనులు

March 23, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.