ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నాణ్యత ప్రమాణాలను బలోపేతం చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానెల్లూరు, బాపట్ల, కర్నూలు లోని ప్రయోగశాలలకు నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ సంస్థ గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు తెలిపారు. బాపట్లలోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాల, నెల్లూరులోని జీవ, సేంద్రీయ ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాల, కర్నూలులోని పురుగుమందుల పరీక్ష కేంధ్రాలకు ఈ గుర్తింపు లభించిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రయోగశాలలు తమ సాంకేతిక నైపుణ్యం,గ్లోబల్ ప్రమాణాలతో నాణ్యత పరీక్షల రంగములో సామర్థ్యం మరియు ప్రమాణాలు నిరూపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను సంపాదించాయని తెలిపారు. దీని ద్వారా వ్యవసాయ వనరుల నాణ్యతపై రైతులకు నమ్మకం మరింత బలపడుతుంది అని , ఇది వ్యవసాయ ఉత్పాదకతలో నాణ్యతా ప్రమాణాలను స్థిరపరిచే దిశగా కీలక అడుగు అని తెలిపారు .బాపట్ల, నెల్లూరు మరియు కర్నూలు ప్రయోగశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు.ఈ గుర్తింపును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ ప్రయోగశాలలను దశలవారీగా ఎన్ ఏ బీ ఎస్ గుర్తింపు పరిధిలోకి తీసుకురావాలన్న సంకల్పాన్ని ప్రభుత్వం తీసుకుంది అని డిల్లీ రావు తెలిపారు.
