Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » జమ్మూకశ్మీర్‌లో మళ్లీ మేఘ విస్ఫోటం.. ఏడుగురు మృతి
జాతీయం

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ మేఘ విస్ఫోటం.. ఏడుగురు మృతి

apanalysisBy apanalysisAugust 17, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్‌ బరస్ట్‌.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విస్ఫోటం సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఆ ప్రాంతానికి చేరుకుందని వెల్లడించారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలా కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

భారీ వర్షాల కారణంగా సహాక్‌ ఖాద్‌, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. కథువా పోలీస్‌ స్టేషన్‌లోకి కూడా వరదనీరు చేరింది.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఎక్స్‌ వేదికగా వివరాలు వెల్లడించారు. మేఘ విస్ఫోటంపై సమాచారం అందగానే కథువా పోలీసు అధికారి శోభిత్‌ సక్సేనాతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. మృతులకు సంతాపం తెలిపారు. మరోవైపు జిల్లా అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు దూరంగా వెళ్లాలని కోరారు.

ఇటీవల మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 82 మంది గల్లంతయ్యారు.

Post Views: 163
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు

March 24, 2026

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌! .. టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

March 24, 2026

ఆశావాహుల‌కు గుడ్ న్యూస్‌.. పెరగ‌నున్న అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాలు

March 24, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.