ఆంధ్రా ట్యాక్సీతో సురక్షిత పర్యటనలకు శ్రీకారం
పర్యాటకుల కోసం ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించిన ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
పర్యాటక రంగ అభివృద్ధిలో ఎన్‌టీఆర్ జిల్లాను ముందంజలో నిలిపే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం “ఆంధ్రా ట్యాక్సీ” పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ యాప్ ద్వారా పర్యాటకులకు అందుబాటు ధరల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన విహారయాత్ర సేవలు అందించనున్నారు. ట్యాక్సీ, ఆటో బుకింగ్‌తో పాటు టూరిజం ప్యాకేజీలు, ఎన్‌టీఆర్ జిల్లా పర్యాటక సమాచారం, ఎస్‌వోఎస్ భద్రతా సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ యాప్‌తో పాటు క్యూఆర్ కోడ్, వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా సేవలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా ఎన్‌టీఆర్ జిల్లాను రాష్ట్రంలో నెంబర్‌వన్ పర్యాటక కేంద్రంగా నిలిపేందుకు టీమ్ ఎన్‌టీఆర్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
