కె డి సి సి బ్యాంకు చైర్మెన్ గా నెట్టెం రఘురాం …
రాష్ట్రంలో మరో 9 డి సి సి బి లకు చైర్మన్ ల నియామకం…
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మెన్ గా మాజీ మంత్రి నెట్టెం రఘురాం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా తో పాటు రాష్ట్రంలో మరో 9 డిసిసిబి లకు కొత్తగా చైర్మన్ లను నియమించింది. కేడీసీసీ చైర్మన్ గూనెట్టెం రఘురాం నియమితులు కాగా శ్రీకాకుళం డిసిసిబి చైర్మన్ గా శిర్వాల సూర్యనారాయణ విశాఖ డిసిసిబి చైర్మన్ గా కోన తాతారావు విజయనగరం కు కిమిడి నాగార్జున గుంటూరు మాకినేని మల్లికార్జునరావు నెల్లూరు ధనుంజయ రెడ్డి చిత్తూరు అమాస రాజశేఖర్ రెడ్డి అనంతపురం కేశవరెడ్డి కర్నూలు విష్ణువర్ధన్ రెడ్డి కడప డి సి సి బి చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి లను నియమించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న నెట్టెం రఘురాం కు కేడిసిసి బ్యాంకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
—
