సముద్రతీరంలో నేషనల్ ఈవెంట్స్….
నయా అమరావతికి గేట్ వే కానున్న బందరు బీచ్….
నాలుగు రోజులపాటు నిర్వహణకు సన్నాహాలు…
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రాధాన్యత….
1500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ….
సముద్ర తీరాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర ….
కె వి కృష్ణారావు. జర్నలిస్టు
పర్యాటకుల మనసు దోచే రీతిలో మంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని రాష్ట్ర గనులు ,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.మే నెలలో నిర్వహించనున్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ కు సంబంధించి మంగళవారం ఆయన సముద్ర తీరం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బీచ్ ఫెస్టివల్స్ లో నిర్వహించబోయే నేషనల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు . ఈ ఉత్సవాలను నాలుగు రోజులు పాటు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నమన్నారు.రెండు మూడు రోజుల్లో తుది రూపం వస్తుందన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ బీచ్ ఫెస్టివల్స్ జరుగుతాయన్నారు. తద్వారా 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ ప్రాంతానికి రావడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు . మంగినపూడి బీచ్ మచిలీపట్నం పోర్టు నయా అమరావతికి గేట్ వే కాబోతున్నాయన్నారు .ఇంతకుముందు 2018 లో బీచ్ ఫెస్టివల్స్ అత్యంత వైభవంగా నిర్వహించామని వాటిని మించిన రీతిలో ఈసారి ఫెస్టివల్స్ జరుగుతాయన్నారు.గత అయిదేళ్ళలో బీచ్ ఎంతో నిర్లక్ష్యానికి గురైందన్నారు. బీచ్ మూసేసినంత పని జరిగిందన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని మంగినపూడి బీచ్ కి పూర్వ వైభవం తెస్తామన్నారు.
ఈ బీచ్ ఫెస్టివల్స్ లో కబాడీ , కయా కింగ్ వంటి నేషనల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తామన్నారు.మే 15 నుంచి 18 వరకు ఈ బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించాలనే తలంపుతో వున్నామన్నారు. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు .రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో మచిలీపట్నం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. దానిలో భాగంగానే భారీ స్థాయిలో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 980 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా మంగినపూడి బీచ్ బెస్ట్ టూరిజం స్పాట్ కాబోతుందన్నారు. మంగినపూడి బీచ్ ప్రాముఖ్యతను తిరిగి సంతరింపజేసే విధంగా ఈ ఉత్సవాలు దోహద పడతా యన్నారు. కబాడీ, కయా కింగ్ వంటి నేషనల్ ఈవెంట్స్ ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయన్నారు. సమ్మర్ సీజన్ కావడంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వారి మనోవికాసానికి తోడ్పడే విధంగా ఈ బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. అందుకోసం 150 ఎకరాలు సిద్ధం చేస్తున్నామన్నారు .ఇవి కాకుండా మరో 250 నుంచి 300 ఎకరాలు పర్యాటక రంగ అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ఈ భూముల్లో రిసార్ట్స్ , స్టార్ హోటల్స్ ఏర్పాటు జరుగుతాయన్నారు. తద్వారా ఈ ప్రాంతానికి 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటానికి ఆస్కారం ఉందన్నారు. మచిలీపట్నం పోర్టు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గంటలో మచిలీపట్నం పోర్టుకు చేరుకునే అవకాశం ఉందన్నారు .ఒక పక్క పోర్టు మరోపక్క మంగినపూడి బీచ్ అమరావతికి గేట్ వే కాబోతున్నాయన్నారు. టూరిజం, స్పోర్ట్స్ శాఖలు సంయుక్తంగా మంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహణకు ముందుకొస్తున్నాయన్నారు. రాష్ట్రం తో పాటు భారతదేశ దృష్టిని ఆకర్షించే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు .పర్యాటకులు కొత్త అనుభూతిని పొందే విధంగా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ,మెప్మా పిడి సాయిబాబు ,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరావు ,మాజీ జడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
