ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు..
ఏపీ స్టేట్ బ్యూరో,
తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరావు ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్ మోడ్రన్ ఆర్ట్ లో నిష్ణాతులు. ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన మోడీ విగ్రహం కూడా ఇందులో ఉంది. ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే నట్టులు, బొల్టుల సాయంతో ఎత్తైన విగ్రహాలు తయారు చేశారు.
ప్రధాని మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా లక్షలు ఖర్చు చేసి అనేక విగ్రహాలను తయారు చేశామని వాటిని సభ వద్ద ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతి తీసుకున్నట్లు వెంకటేశ్వరావు తెలిపారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్దుడు, సింహం, సైకిల్ తో పాటు తెలుగు దేశం పార్టీ సింబల్ ను కూడా ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు అమరావతి పేరును కూడా తీగతో ఆకట్టుకునేలా రూపొందించారు. వీటన్నింటిని సభకు వచ్చే ప్రముఖులతో పాటు ఇతరులు తిలకించాలనేది తమ కోరిక అని శిల్పి రవిచంద్ర తెలిపారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పేరుగాంచింది. గతంలోనూ అనేక అవార్డులు పొందినట్లు శిల్పులు తెలిపారు.
