గ్రామీణ రహదారులకు రూ.400 కోట్లు కేటాయింపు
సీనియార్టీ ప్రాతిపదికగా బిల్లలు చెల్లింపులు
ఏపీ స్టేట్ బ్యూరో,
రాష్ట్రంలో రహదారులకు పూర్వ వైభవం వస్తోంది. గ్రామీణ రహదారులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు రూ. 400 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.. నాబార్డు పథకంలో భాగంగా ఈ నిధులతో 192 పనులను చేపట్టనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ధ్వంసమైన రహదారులు, ఇంకా మరమ్మతులు చేయాల్సి ఉన్న రోడ్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్రాన్ని ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 861 కోట్లతో దాదాపు 20 వేల కి.మీ రోడ్లను గుంతల రహితంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అలాగే గుంతలు పూడ్చడానికి వీలులేని విధంగా ఉన్న రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారులను సీ కేటగిరీ కింద రూ. 600 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. గుంతల రహిత రహదారులే లక్ష్యంగా ఆయా పనులకు విజయవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల త్వరితగతిన ఇచ్చేందుకు రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.. పాత్ హోల్ ఫ్రీ పనులకు సంబంధించి ఆయా బిల్లులు అప్ లోడ్ చేసిన వారికి, సీనియర్టీ ప్రాతిపదికగా తీసుకుని, బిల్లులు చెల్లించనున్నది. .
