Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » పందెం కాసి, ఐదు ఫుల్ బాటిళ్ళు తాగి, ప్రాణాలు వదిలాడు.
క్రైం

పందెం కాసి, ఐదు ఫుల్ బాటిళ్ళు తాగి, ప్రాణాలు వదిలాడు.

apanalysisBy apanalysisMay 3, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

క్రైం బ్యూరో.

నలుగురు స్నేహితుల మధ్య సరదాగా మొదలైన పోటీ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి రూ.10 వేలకు పందెం వేసుకొని..ఐదు సీసాల మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోలార్ జిల్లాలోకు చెందిన కార్తిక్ కి గత ఏడాది వివాహం జరిగింది. అతని భార్య ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. కార్తిక్, అతని మరో ముగ్గురి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

             ఇక నలుగురు ఫ్రెండ్స్‌ పార్టీలో కూర్చుంటే మామూలుగా ఉంటుందా.. ఒకరిపై ఒకరు జోక్స్‌ వేస్తూ, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఎంతో సరదాగా ఎంజాయ్‌ చేస్తూ గడుపుతారు. కొన్నిసార్లు తినడం, తాగడం విషయంలో బెట్టింగ్స్‌ కూడా వేసుకుంటారు. ఇలాగే కార్తీక్, అతని ఫ్రెండ్స్‌ వెంకట రెడ్డి, సుబ్రమణి, మరో ముగ్గురి కలిసి పార్టీ చేసుకుంటుండగా ఓ పందెం పెట్టుకున్నారు. కార్తిక్‌ తాను ఐదు ఫుల్‌ బాటిల్స్‌ మద్యం తాగుతానని..ఫ్రెండ్స్‌తో అన్నట్టు తెలుస్తోంది. అలా తాగితే రూ.10,000 ఇస్తానని ఓ స్నేహితుడు కార్తీక్‌తో పందెం వేసుకున్నట్టు సమాచారం. దీంతో పెట్టుకున్న పందెం ప్రకారం.. కార్తీక్ ఐదు ఫుల్ బాటిల్స్ తాగినట్టు తెలుస్తోంది. అయితే అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ మద్యం తాగిన కొద్దిసేపటికి కార్తిక్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో స్నేహితులు కార్తిన్‌ను కోలార్ జిల్లాలోని ముల్బాగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించి వైద్యలు చికిత్స అందించారు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో కార్తిక్ కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని కార్తిక్‌ స్నేహితులు వెంకట రెడ్డి, సుబ్రమణి సహా మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి స్నేహితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

—

Post Views: 33
వికటించిన స్నేహితుల పందెం.
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

వెబ్ సిరీస్‌ చూసి.. బాలుడి ఆత్మహత్య

August 9, 2025

నగరంలో దొంగనోట్ల కలకలం

August 8, 2025

ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడీ

July 29, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.