Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » అమల్లోకి వీఐపీ బ్రేక్‌ నూతన వేళలు
ప్రత్యేకం

అమల్లోకి వీఐపీ బ్రేక్‌ నూతన వేళలు

apanalysisBy apanalysisMay 4, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో తాజాగా చేసిన మార్పులు శనివారం అమల్లోకి వచ్చాయి. గత ప్రభుత్వం నుంచి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే క్రమంలో ప్రస్తుత పాలకమండలి ప్రయోగాత్మకంగా ఈ మార్పులు చేపట్టింది. గతంలో గురు/శుక్రవారాల్లో ఉదయం 7.30 గంటల నుంచి మిగిలిన రోజుల్లో 8.30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1.30 గంటలు దాటినా వరుసగా బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి, దాతలు, ఉద్యోగుల దర్శనాలు కొనసాగేవి. దీంతో ఉదయం క్యూలైన్‌లోకి వచ్చిన సర్వదర్శనం, రూ.300 ఎస్‌ఈడీ భక్తులు ఇబ్బంది పడేవారు. దీంతో తితిదే పాలకమండలి పలు మార్పులు చేపట్టింది. మే ఒకటో తేదీ నుంచి నూతన వేళలు అమలు చేయాల్సి ఉన్నా గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం నేపథ్యంలో యథావిధిగా కొనసాగించారు.

శనివారం మొదటి రోజు రెండు విడతలుగా బ్రేక్‌ విధానం అమలు చేశారు. మొదట ఉదయం 6.20 నుంచి 8.30 వరకు వీఐపీ ప్రొటోకాల్, రెఫరల్, జనరల్‌ బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం కల్పించారు. ఈలోగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న సామాన్య భక్తులను దర్శనాలకు వదిలారు. నైవేద్య విరామం పూర్తికాగానే 10.20 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, దాతలు, తితిదే విశ్రాంత ఉద్యోగులకు దర్శనం కల్పించారు. గతంతో పోల్చుకుంటే 4.30 గంటల్లోపే వీఐపీ బ్రేక్‌ ముగించినట్లయింది. మధ్యలో సర్వదర్శనాలు అనుమతించడంతో సామాన్య భక్తులకు 1.45 గంటల పాటు సమయం కలిసి వచ్చినట్లయింది. దీంతో అదనంగా ఏడు వేల మంది భక్తులకు సర్వదర్శనం లభించింది. వేళల మార్పుపై మరో రెండు, మూడు రోజులు పరిశీలించి తర్వాత కొనసాగించనున్నారు.

Post Views: 33
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రాజెక్టు ఒకటే… పేరు మారుతూనే ఉంటుంది!

December 29, 2025

రీల్ హీరో కాదు…రియల్ హీరో.

October 30, 2025

పిల్లిమొగ్గల రియల్

October 25, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.