ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మృతులను నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడుకు చెందిన రమణయ్య (60), బాబు (45), నాగేంద్ర (25)గా గుర్తించారు. బోల్తాపడిన లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్(14) మృతి చెందారు. వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్నట్లుగా గుర్తించారు.
