Author: apanalysis

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా  కార్యాచరణ, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు. 16 చోట్ల 1036 బస్సుల తనిఖీలు – 236 బస్సులకు జరిమానాలు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేసారు.  ప్రత్యేక తనిఖీలు ప్రారంభం సరైన పత్రాలు లేని మోటార్‌ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు, హైవేస్‌, అగ్ని మాపకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.  16 పాయింట్లలో కట్టుదిట్టమైన తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాలు, వివిధ చెక్‌పోస్టులు చింతూరు పోలీస్ స్టేషన్, పలమనేరు, నరహరిపేట, జిలుగుమిల్లి, కత్తిపూడి, పుల్లూరు టోల్ ప్లాజా, సున్నిపెంట, చిలకల్లు టోల్ ప్లాజా, బడవ టోల్ ప్లాజా, సాగర్ టోల్ ప్లాజా, దాచేపల్లి టోల్ ప్లాజా, శ్రీ కాళహస్తి టోల్గేట్, సూళ్లూరుపేట టోల్గేట్,…

Read More

ద్వితీయ శ్రేణినేతలకు లక్కీఛాన్స్ పోటీకి సై అంటున్న కేడర్ 175 నుంచి 263కు పెరగనున్న అసెంబ్లీ సీట్లు మహిళలకు 87 సీట్లు వచ్చే అవకాశం 25 నుంచి 38 వరకు పెరగనున్న లోక్ సభ సీట్లు ప్రారంభమైన నియోజకవర్గాల పునర్విభజనకసరత్తు ఎం.గణేశ్, జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం 2026 తర్వాత భారీగా మారబోతోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం దశాబ్దాలుగా కొనసాగుతున్న 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల సంఖ్య పెరగడం ఇప్పుడు ఖాయమైంది. నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలతో, 2011 జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాల్లో ఎన్ని కొత్త సీట్లు రాబోతున్నాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. జిల్లాల వారీగా అసెంబ్లీ స్థానాల అంచనా ప్రస్తుత 175 నుండి 263 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగు 25 నుంచి 38 వరకు లోక్ సభ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జనాభా సాంద్రతను బట్టి ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా సుమారు 50% సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీనితో అన్ని రాజకీయ పార్టీల్లోని…

Read More

నియోజకవర్గాల పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆయన సుమారు మూడు గంటలకు పైగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపై చర్చించారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆరా తీశారు. కమిటీల ఏర్పాటు విషయంలో పిఠాపురం మోడల్‌ని మిగతా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని సూచించారు. కూటమి పార్టీల సయోధ్య విషయంలో దిశానిర్దేశం చేశారు.

Read More

మతమార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ చింతాడ ఆనంద్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. నేడు తుది ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్‌ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటూ రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్‌ పాస్టర్‌గా పనిచేస్తుండటంతో క్రైస్తవుడవుతారని.. రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు…

Read More

భారతీయ రైల్వే (Indian Railways) టికెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. ట్రైన్‌ బయల్దేరే సమయం ఆధారంగా టికెట్‌ సొమ్మును రిఫండ్‌ చేసే విధానాన్ని సవరించింది. కొత్త రూల్స్‌ ప్రకారం 72 గంటల ముందు ఎవరైనా కన్ఫామ్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం రిఫండ్‌ (క్యాన్సిలేషన్‌ ఛార్జీలకు లోబడి) చేసేలా మార్పులు చేసింది. బోర్డింగ్‌ పాయింట్‌ నిబంధనలనూ మార్చింది. ఈ మేరకు కొత్తగా తీసుకొచ్చిన పలు సంస్కరణలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వివరించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య దశలవారీగా ఈ మార్పులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త రూల్స్‌ ఇలా.. ప్రయాణానికి 72 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే ‘మ్యాగ్జిమమ్‌ రిఫండ్‌’ చేస్తారు. కొంత క్యాన్సిలేషన్‌ ఛార్జీలను ఉపసంహరించుకుని మిగిలిన మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు. ట్రైన్‌ బయల్దేరడానికి 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్‌…

Read More

ఏపీ ఎనాల‌సిస్ ప్ర‌తినిధి: లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరుతాయి. లోక్‌సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది.…

Read More

వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే కొద్ది మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, శరీరానికి చలవను అందించే పండ్లు తీసుకోవడం చాలా అవసరం వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే కొద్ది మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, శరీరానికి చలవను అందించే పండ్లు తీసుకోవడం చాలా అవసరం. కేవలం రుచికే కాదు, అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కొన్ని ప్రత్యేకమైన పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం 1.పుచ్చకాయ: వేసవి అంటేనే ముందుగా గుర్తుకొచ్చే‌ది పుచ్చకాయ. ఇందులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే ‘లైకోపిన్’ చర్మాన్ని ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుంది. 2.నిమ్మకాయ: వేసవి కాలం మాత్రమే కాదు.. అన్ని సీజన్లలో నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు…

Read More

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి. సోమవారం మొదలవడమే భారత స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిఫ్టీ 50 ఏకంగా 392.90 పాయింట్లు పడిపోగా, సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో సెన్సెక్స్ 72,977.34 కనిష్ట స్థాయికి చేరింది. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 5 లక్షల కోట్లు ఆవిరైనట్లు అంచనా నిఫ్టీ నిన్నటి ముగింపు 23,114.50తో పోలిస్తే, మార్కెట్ భారీ ‘గ్యాప్ డౌన్’తో ఓపెన్ అయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,634.55 కనిష్ట స్థాయిని కూడా తాకింది. కీలకమైన 23,000 మద్దతు స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్1,264.49…

Read More

ప్రతి నీటి బొట్టునూ సంరక్షించుకుని భవిష్యత్తును కాపాడుకుందామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. నీటి ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ జలజీవన్‌ మిషన్, ఉపాధి హామీ పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాలు, తాగునీటి ప్రాజెక్టుల పనులను వివరించారు. ‘గత 20 నెలల్లో ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల 1,06,788 వ్యవసాయ కుంటలు, 13,500 పశువుల తొట్టెలను నిర్మించాం. 1.46 కోట్ల జనాభాకు లబ్ధి చేకూరేలా రూ.9,441 కోట్లతో 8 మల్టీ విలేజ్‌ నీటి పథకాల పనులు చేపట్టాం. రూ.9,355 కోట్లతో త్వరలో మరో ఏడు మల్టీ విలేజ్‌ పథకాల పనులు ప్రారంభం కానున్నాయి. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న మరో 3 వేల గ్రామాల్లో 38.54 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూ.1,814.71 కోట్లతో…

Read More

ఈ ఏడాది ఆరంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాల మెరుపులు తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు (Gold, Silver Rates) భారీగా క్షీణించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ (Gold) ఔన్సు ధర 4,377.95 డాలర్లకు దిగొచ్చి నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. స్పాట్‌ గోల్డ్‌ ధర తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో రోజు కావడం గమనార్హం. గత వారం ఆరంభంలో ఈ పసిడి ధర 5000 డాలర్ల పైన పలికింది. అటు వెండి (Silver) ధర 65.74 డాలర్లకు పతనమైంది. ఇక, దేశీయంగానూ ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. ఏప్రిల్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర నేడు 4.59శాతం తగ్గి రూ.1,37,862 వద్ద కొనసాగుతోంది. మే ఫ్యూచర్స్‌లో వెండి ధర 5.70శాతం పతనమై కేజీ ధర…

Read More