Author: apanalysis

25 లక్షల మంది అవుట్ పేషెంట్లకు వైద్యం. త్వరలో బోన్ మారో మార్పిడి ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. మంగళగిరిలో నెలకొల్పిన ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) అందిస్తున్న వైద్య సేవలు రికార్డు స్థాయికి చేరాయి. 25 లక్షల మంది అవుట్ పేషెంట్లకు వైద్యం అందించిన ఘనత ఎయిమ్స్ సాధించింది. ఈ ఇన్స్టిట్యూట్లో త్వరలో బోన్ మారో (ఎముక మూలుగ) మార్పిడి చికిత్స ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .ఈ వైద్య సేవలు దేశంలో కేవలం 11 హాస్పిటల్స్ లో మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి .ఇకపై మంగళగిరి ఎయిమ్స్ లో ఈ చికిత్స అందుబాటులోకి రానుంది.ఇదిలావుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 11 సూపర్ స్పెషాలిటీస్ వైద్య సేవలు ఎయిమ్స్ లో ప్రవేశ పెట్టడం గమనార్హం .ఇందుకోసం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేసినట్టు తెలుస్తోంది.చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి ఎయిమ్స్ సాధించడమే కాకుండా రికార్డ్…

Read More

ఈ బ్యాంకుల క్రెడిట్‌ కార్డు చార్జీలు మారుతున్నాయ్‌..! ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డులపై చార్జీలను సవరిస్తున్నాయి. కార్డ్‌ యూసేజ్‌, బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ చార్జీలు వచ్చే నెల జూలై 1 నుంచి మారుతాయని ఆయా బ్యాంకులు అధికారికంగా ప్రకటించాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ఆన్‌లైన్‌ గేమింగ్‌డ్రీమ్‌11, రమ్మీ కల్చర్‌, జంగ్లీ గేమ్స్‌ లేదా ఎంపీఎల్‌ వంటి ఆన్‌లైన్‌ నైపుణ్య ఆధారిత గేమింగ్‌ వేదికలపై నెలకు రూ.10 వేలకు మించి క్రెడిట్‌ కార్డు యూజర్లు వెచ్చిస్తే మొత్తం నెలవారీ ఖర్చుపై 1 శాతం ఫీజు పడుతుంది. అయినప్పటికీ ఒక నెలకుగాను ఈ చార్జీకి గరిష్ఠ పరిమితి రూ.4,999. అలాగే ఈ గేమింగ్‌ లావాదేవీలకు ఎటువంటి రివార్డ్‌ పాయింట్లూ ఉండవు. డిజిటల్‌ వ్యాలెట్‌పేటీఎం, మొబీక్విక్‌, ఫ్రీచార్జ్‌ లేదా ఓలా మనీ వంటి థర్డ్‌పార్టీ వ్యాలెట్లలోకి నెలలో రూ.10 వేలకు మించి క్రెడిట్‌ కార్డు వినియోగదారులు పంపితే ఆ మొత్తంపై నెలకు రూ.4,999 దాటకుండా…

Read More

ఎం.గణేశ్, ఏపీ ఎనాలిసిస్ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సుస్ధిరమైన పాలన కొనసాగడానికి కాపు సామాజిక వర్గం ప్రధాన కారణమని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే మూడు పార్టీల కూటమి ఏర్పడిందని, దీని వలన పటిష్టమైన, సుస్ధిర పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక నిధులు, ప్రాజెక్టులు తీసుకువచ్చే అవకాశం కాపు సామాజికవర్గం వల్లనే సాధ్యమైందన్నారు. ఈ విషయాన్ని మన సామాజికవర్గం గుర్తించాలన్నారు. రాయల్ క్లబ్ విజయవాడ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారనికి సుబ్బారాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం సంయుక్త కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. నున్నలో కాపుల కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తో మాట్లాడుతానని స్పష్టం చేశారు. రాయల్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఇతర సామాజికవర్గాలతో…

Read More

శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ వైసీపీ నాయకులు బల ప్రయోగం, పరామర్శలు, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారధి హెచ్చరించారు. సాక్షి ఛానల్ లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెప్పులు, రాళ్లు విసిరారని ఆయన చెప్పారు. ఇదంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.  కేవలం నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి వైసీపీ పొదిలిలో ర్యాలీ చేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీకి రైతలు, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీకి జగన్ రారు. ప్రజల సమస్యలు ప్రస్తావించరు. రైతులు, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన కోరారు.  కూటమి ప్రభుత్వం ఈ యేడాది కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం డబ్బులిచ్చింది. వైసీపీ నాయకులు గమ్యం లేని సంక్షేమ…

Read More

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్-100లో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్ రామ్ కిరీటి, 56వ ర్యాంకు సాధించిన కె.మోహిత శ్రీరామ్, 59వ ర్యాంకు సాధించిన డి.సూర్యచరణ్, 64వ ర్యాంకు సాధించిన పి.అవినాష్, 70వ ర్యాంకు సాధించిన వై.సమీర్ కుమార్, 92వ ర్యాంకు సాధించిన టి.శివమణిదీప్ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలిపారు. దేశస్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందన్నారు.. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారన్నారు.. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్ లో ప్రజలకు సేవలందించాలని ఆయన కోరా

Read More

ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు నీట్ ర్యాంకుల విషయంలో ఏపీలోని కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య తక్కువ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ, ఇవి వ్యాపారం కోసం ప్రజలను మభ్యపెట్టే రీతిలో చర్యలు తీసుకుంటున్నాయని YSRCP NTR జిల్లా డాక్టర్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ చెబుతున్నారు. తాజా డేటా ప్రకారం, నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య కేవలం 36,776 మంది మాత్రమే అర్హత ఉత్తరప్రదేశ్ (170,684), రాజస్థాన్ (119,865), మరియు బీహార్ (80,954) మంది ఉన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల కంటే మార్కులను హైలైట్ చేస్తున్నాయి. 2019లో నీట్‌లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతం 6% నుండి ఈ సంవత్సరం 3%కి పడిపోయింది. విద్యా వ్యవస్థ నుండి కార్పొరేట్ మాఫియాను తొలగించడానికి మరియు విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం వెంటనే…

Read More

సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. సీనియర్ జర్నిలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావుకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని ఆదేశించింది. కొమ్మినేని అరెస్ట్ పైన దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని హెచ్చరించింది. భవిష్యత్ లో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాల్లో తాము కూడా నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది. అంతమాత్రానా ఏదో తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించింది. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. చర్చలను గౌరవ ప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంలో దాఖలు…

Read More

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నామని, అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో, ‘పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు, దీపం-2, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో…. లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామని చెప్పారు. మెగా డిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు…పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు…

Read More

ఏరువాకకు శ్రీకారం ఏపీ ఎనాలిసిస్, చాట్రాయి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. బుధవారం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఏడాది పొడవునా అన్నదాతలకు సిరులు పండేలా చేయాలని కోరుతూ, ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, డ్రోన్లు అందించడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేయడంలో భాగంగా ఈనెల 20 వతేదీన రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితులు అనుకూలించనప్పటికీ రైతులకు మేలుచేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీపడేది లేదన్నారు.

Read More

ఏరువాకకు శ్రీకారం ఏపీ ఎనాలిసిస్, చాట్రాయి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. బుధవారం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఏడాది పొడవునా అన్నదాతలకు సిరులు పండేలా చేయాలని కోరుతూ, ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, డ్రోన్లు అందించడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేయడంలో భాగంగా ఈనెల 20 వతేదీన రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితులు అనుకూలించనప్పటికీ రైతులకు మేలుచేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీపడేది లేదన్నారు.

Read More