Author: apanalysis

కార్మిక చట్టంలో సవరణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమేనట * స్పష్టం చేసిన మంత్రి పార్థసారథి M.GANESH. VIJAYAWADA. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు పది గంటలు పని చేయాల్సి ఉంటుంది. వీరి కోసం కార్మిక చట్టాల్లో భారీ మార్పులు చేపట్టింది. సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాకరీల చట్టం ప్రకారం ఇప్పటి వరకు 9 గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కార్మిక చట్టంలోని సెక్షన్ 54లో మార్పులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు పని చేయడానికి పరిమితి ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెట్టుబడులు భారీగా ఆకర్షిం చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటి. మాన్ పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పని గంటలు కూడా 10…

Read More

స్టేట్ బ్యూరో, ఏపీ ఎనాలిసిస్ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ర్ట ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని, దీన్ని గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నాలాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నాలా ను రద్దు చేసి ప్రజలు ట్యాక్స్ కట్టేస్తే ఆటోమేటిక్ గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎవరైనా ఏదైనా మున్సిపాల్టీలో వెంచర్ వేస్తే వారికి భూ మార్పడి ఎలా చేయాలి, ఎవరైనా పరిశ్రమ పెడితే వారికి భూ…

Read More

M.GANESH,VIJAYAWADA. ఎన్నికల హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్, పయ్యావుల కేశవ్, అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపే తల్లులకు కానుకగా పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమ చేయాలని సీఎం ఆదేశించారు. పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు.సమీక్షలో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ….అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని అన్నారు. పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నామనే విషయాన్ని సమీక్షలో వివరించారు. ఇక పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో.. 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద…

Read More

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసులపై వైసీపీ సైకోలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ తన తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని, అలాగే వారిని కోర్టుకు ఈడ్చారని ఫైర్ అయ్యారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని లోకేష్ విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్‌రెడ్డి బేషరతుగా…

Read More

ఏపీ ఎనాలిసిస్, తిరుపతి దేశమంతా ప్రధాని మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌ను కోరుకుంటోందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌ వల్లే ఏపీలో అభివృద్ధి మెరుపు వేగంతో జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. తిరుపతిలో కేంద్రమంత్రి బండి ఇవాళ‌ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… మోదీ 11 ఏళ్ల పాలన విశేషాల‌ను వివ‌రించారు. ఇప్పటికే ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ఇచ్చిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,741 కి.మీ హైవేలను నిర్మించామని వెల్ల‌డించారు. పలు ఎయిర్‌పోర్టు లను మరింత ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైల్వే బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేశామని, అమృత్ మహోత్సవంలో భాగంగా.. రాష్ట్రంలోని అనేక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ఏపీకి 24 లక్షల ఇళ్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్ల‌డించారు.

Read More

ఏపీ ఎనాలిసిస్, పొదిలి రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని పొదిలిలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు కార్యాల‌యంలో ఉన్న‌ రైతులను పరామర్శించారు. వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. రైతులను అడిగి పొగాకు కొనుగోలు రేట్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ మండిపడ్డారు. ఇక, వరి, మిర్చి, పొగాకుతో పాటు ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదని పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించామ‌న్నారు. గత ఏడాదిగా రైతు…

Read More

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. అమ‌రావ‌తి రాజ‌ధానిలో నివ‌సించే మ‌హిళ‌ల‌పై అవాకులు, చ‌వాకులు పేలిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఆర్ వీవీ కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసులు న‌మోదు చేశారు. త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ.. కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. పోలీసులు కేసు పెట్టారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌ల‌తో పోల్చ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్న మ‌హిళ‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాలు చేస్తున్నారు. సాక్షి కార్యాల‌యాల వ‌ద్ద ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు కూడా ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇప్ప‌టికే యాంక‌ర్ కొమ్మినేని శ్రీనివాస‌రావును అరెస్టు చేశారు. జైలుకు త‌ర‌లించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న కృష్ణంరాజు కోసం వెతుకుతున్నారు. విజ‌య‌వాడ స్థానికుడైన కృష్ణంరాజు.. ఈ కేసు న‌మోదైన వెంట‌నే ఇంటికి తాళం వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయ‌న కోసం పోలీసులు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ఢిల్లీలోనూ వెతుకుతున్న‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. అజ్ఞాతంలో ఉన్న…

Read More

విజయవాడ-గుంటూరు ఏపీ ఎనాలిసిస్, మంగళగిరి విజయవాడ, గుంటూరు మధ్య ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మంగళగిరికి 50, గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం MTMC కేంద్రంగా 7 మెగావాట్ల సామర్థ్యంతో ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. విద్యుత్ సరఫరా చేస్తోంది. గంటూరు జిల్లా పాతూరులో 1.8 మెగావాట్ల సామర్థ్యంతో ఒక ప్రైవేటు సంస్థ 60 బస్సులకు ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యంతో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా కాజాలో 3 కేంద్రాలు ఉన్నాయి.. ఇక్కడ ఒక్కో కేంద్రంలో 250 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. కుంచనపల్లిలో 2, ఆత్మకూరులో 1, పెదవడ్లపూడిలో ఒక కేంద్రాలను ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెండు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.. మిగిలినవి కూడా పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఛార్జింగ్ గన్‌కు 45 కిలోవాట్ల సామర్థ్యం ఉండగా.. ఈ మేరకు…

Read More

దేశం విడిచిపెట్టకుండా పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశం ఏపీ ఎనాలిసిస్, హైదరాబాద్ ఓబులాపురం మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి (Gali Janardhan Reddy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి సహా దోషులందిరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి శాసనసభ సభ్యత్వం పోకుండా సీబీఐ కోర్టు (CBI Court) ఇచ్చిన తీర్పుపై హైకోర్టు న్యాయస్థానం స్టే విధించింది. రూ.10 లక్షలతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలులేదని స్పష్టం చేసింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read More

యోగాంధ్ర మనందరిదీ-మంత్రి లోకేష్ యోగాంధ్ర ఏర్పాట్లపై ఉన్నత స్ధాయి సమీక్ష ఏపీ ఎనాలిసిస్, విశాఖపట్నం ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం ప్రజలందరిదీనని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ వేడుక నిర్వహణను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ నగరం వైపు చూస్తోందన్నారు. ప్రధాని మోదీ, పలువురు ముఖ్యులు హాజరవుతున్నందున ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్ హాలులో యోగాంధ్ర ఏర్పాట్లపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ. పరిధిలో 247 కంపార్టుమెంట్లలో 5 లక్షల మందితో నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించనుంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ భాగస్వాములు కావాలి. ప్రధాని వేదికపైకి చేరుకునే గంట ముందే ప్రజలంతా ఆయా కంపార్ట్మెంట్లలోకి చేరేలా రవాణా సౌకర్యం కల్పించాలి. దూర…

Read More