ప్రజలతో టీడీపీ మమేకం ఏడాది పాలన పూర్తయిన నేపధ్యం కొత్త నిర్ణయాలు M.GANESH, VIJAYAWADA. టీడీపీ ప్రజలకు మరింత చేరువకావాలని భావిస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపధ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజలకు అందించిన పథకాలు, చేసిన పనులపై సింహావలోకం చేసుకుంది. కొన్ని సమయాల్లో జరిగిన లోటుపాట్లు, ప్రజల్లో నెలకొంటున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటున్నది. కొన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నది. ప్రజల పరంగా పార్టీ హవా తగ్గకూడదన్న వ్యూహాన్ని అమలు చేస్తుంది.ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు ఆశిస్తున్న స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వంపై రియాక్షన్ ఉండడం లేదు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే చేయించిన సర్వేల్లో 80 శాతం సంతృప్తి ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులకు అంత మొత్తంలో సానుకూలత లేదన్న విషయం తరచుగా చర్చకు వస్తోంది. దీని వల్ల పై స్థాయిలో ఎంత చేసినా.. రేపు ఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల…
Author: apanalysis
ఏపీలో భారీ పెట్టుబడులు ప్రభుత్వంతో ఒప్పందం. M.GANESH, VIJAYAWADA. రిలయన్స్ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. దీని కోసం 65 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఒక్కో ప్లాంట్ రూ.130 కోట్ల ఖర్చుతో 500 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నది. దీని తర్వాత కర్నూలు జిల్లాలో రూ.1,622 కోట్లతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ యూనిట్‌లో ప్యాకేజ్డ్ సాఫ్ట్ డ్రింకులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేయనున్నట్లు తెలిపింది. దీని కోసం మొదటిదశలో రూ.1,006 కోట్లు, రెండో దశలో రూ.616 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఆరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని డీపీఅర్‌లో పేర్కొంది. ఈ యూనిట్ కారణంగా కర్నూలు జిల్లాలో 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఆఫీసు భవనాలు, వేర్ హౌసింగ్, బాట్లింగ్ లైన్ ఏరియా, ట్రీట్‌మెంట్ ప్లాంటుల కోసం 100 ఎకరాలు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. —
తన అరెస్టు వెనుక వెనుక పెద్ద రాజకీయ కుట్ర (political conspiracy) ఉందని కొమ్మినేని ఆరోపించారు. “తొమ్మిదేళ్ల క్రితం ఎన్టీవీలో ఉన్నప్పుడు అమరావతి భూ వ్యవహారాలపై ప్రశ్నించాను. అప్పటి నుంచే నాపై కక్ష పెంచుకున్నారని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఇప్పుడు సాక్షిలో నిర్వహిస్తున్న డిబేట్లు నిశ్శబ్దం చేయాలన్న కుట్రలో భాగమే ఈ దాడి” అని విమర్శించారు. తాను ‘అమరావతి మహిళలు’ అనే పదం ఎక్కడా ఉపయోగించలేదని, కావాలనే తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. “70 ఏళ్ల వయసులో ఇలా కక్ష సాధించడం బాధాకరం. పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదని, కనీసం స్థానిక కానిస్టేబుల్ కూడా వెంట లేరు. ID కార్డు చూపించి రమ్మంటే ఎలా?” అని ప్రశ్నించారు. ఫిర్యాదు ఎవరు చేశారనే విషయాన్ని కూడా పోలీసులు స్పష్టంగా చెప్పలేదన్నారు. “ప్రజలు అంటున్నారు అంటే టీడీపీ కార్యకర్తలేనా? ఎవరి నష్టమో స్పష్టత ఉండాలి” అని వ్యాఖ్యానించారు. “ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కాదు……
టీడీపీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే జూలై 1 నుంచి గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంబించనుంది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను ఇప్పటికే రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్తయిన నేపథ్యంలో పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించను న్నారు. ప్రజల పరంగా పార్టీ హవా తగ్గకూడదన్న వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ పార్టీని ప్రజలకు కనెక్షన్ కలిపి ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఏంటి లక్ష్యం..? పాలనపరంగా ఏడాది పూర్తయినప్పటికీ.. పార్టీ అధినేత చంద్రబాబు ఆశిస్తున్న స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వంపై రియాక్షన్ ఉండడం లేదు. నిజానికి చంద్రబాబు ఇప్పటికేచేయించిన సర్వేల్లో 80 శాతం సంతృప్తి ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులకు అంతే మొత్తంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉందన్న విషయం తరచుగా చర్చకు వస్తోంది. దీనివల్ల పై స్థాయిలో ఎంత చేసినా.. రేపుఎన్నికల…
శతాధిక చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ సాధించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. అలాంటిది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య బాబుకు ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పవన్, “శతాధిక సినిమాల్లో కథానాయకుడిగా పేరు గాంచిన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణగారు ప్రజా జీవితంలో హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్, నారా రోహిత్, బాలకృష్ణ కూతురు తేజస్విని, దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని తదితరులు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషెస్‌తో సోషల్ మీడియా వీధులన్నీ బాలయ్య పేరిట మార్మోగిపోతున్నాయి. ఇక…
ఒంగోలు : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు మహిళ గాలి మాధవీలత రెడ్డి కీలక పాత్ర పోషించారు. 17 సంవత్సరాల పాటు నిరంతరంగా కన్సల్టెంట్‌గా సేవలందించిన మాధవీ, ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి ముఖ్యమైన శాస్త్రీయ పునాది వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐఐఎస్‌సీ బెంగళూరు లో Geotechnical Engineering ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, Rock Mechanics రంగంలో ఆమె పరిశోధనలు ఈ వంతెన నిర్మాణంలో కీలకంగా నిలిచాయి. ఈ చినాబ్ వంతెన భారతదేశంలోనే కాక, ప్రపంచంలో కూడా అద్భుత ఇంజినీరింగ్ చరిత్రగా నిలిచింది. ఇది ఐఫిల్ టవర్ కంటే ఎత్తు కలిగిన వంతెనగా గుర్తింపు పొందింది. జమ్మూ-శ్రీనగర్ మధ్య భద్రతా అవసరాల కోసం నిర్మించిన ఈ వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మైలురాయి వెనుక మాధవీలత బృందం కృషి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. మాధవీలత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందినవారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, చదువులోనూ, పరిశోధనల్లోనూ ప్రత్యేకంగా రాణించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకటరెడ్డి. భర్త హరిప్రసాద్ రెడ్డి బాపట్ల…
తన్మయం చెందిన పర్యాటక హృదయాలు… నాలుగు రోజుల పాటు పులకింత…. కృష్ణారావు, మచిలీపట్నం వేసవి ఎండలను లెక్క చేయలేదు… అర్ధరాత్రి దాటినా బీచ్ ను వదిలి వెళ్ళలేదు… అంతగా పర్యాటకల మనసు దోచాయి మసులా బీచ్ ఫెస్టివల్స్… నాలుగు రోజులపాటు పర్యాటక హృదయాలు ఎంతో తన్మయం చెందాయి. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీ పట్నం లోని మంగినపూడి లో నాలుగు రోజులు పాటు అంగరంగ వైభవంగా మసులా బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈనెల 5 నుంచి 8 వరకు సముద్రతీరంలో మసులా బీచ్ ఫెస్టివల్స్ తారాస్థాయిలో జరిగాయి. వీటి నిర్వహణలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తన మార్కును మరోసారి రుజువు చేసుకున్నారు. అతి తక్కువ సమయంలో అత్యంత పెద్ద ఈవెంట్ ను నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. వినూత్న కార్యక్రమాలతో అబ్బురపరిచాయి. బీచ్ ఫెస్టివల్స్ ప్రారంభానికి ముందు రోజు మచిలీపట్నం టౌన్ లో నిర్వహించిన 2కే రన్ మొదలుకొని ఫెస్టివల్స్…
అమరావతి మహిళ పై అనుచిత.. అసభ్య వాఖ్యల వివాదంలో సాక్షి ఛానల్ ప్రముఖ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి లో కొమ్మినేని నిర్వహించిన చర్చలో జర్నిలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున నిరసన లు వ్యక్తం అయ్యాయి. అమరావతి రైతులు.. మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్ లో కొమ్మినేని ని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు తీసుకొస్తున్నారు. ఇదే కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజు పైన కేసు నమోదైంది. సాక్షి యాజమాన్యం పైన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు.
ఆడబిడ్డలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. భూములిచ్చిన రైతులపై కొందరు నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, సభ్యసమాజం సహించలేనివని చెప్పారు. ఎకరా భూమి ఉన్న రైతులు కూడా రాజధాని కోసం భూములిచ్చారని గుర్తుచేశారు. భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని కొనియాడారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతిఒక్కరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.
అమరావతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన వారికి సమన్లు జారీ చేస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాజధానికి చెందిన దళిత మహిళలు ఆమెను కలిసి వినతిపత్రం అందించారు. ‘మహిళా కమిషన్ తరఫున దీనిని సుమోటోగా తీసుకుంటాం. ఇది చాలా సీరియస్ అంశం. మళ్లీ ఇలా వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకుంటాం’ అని శైలజ స్పష్టం చేశారు.