అమరావతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన వారికి సమన్లు జారీ చేస్తామని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాజధానికి చెందిన దళిత మహిళలు ఆమెను కలిసి వినతిపత్రం అందించారు. ‘మహిళా కమిషన్ తరఫున దీనిని సుమోటోగా తీసుకుంటాం. ఇది చాలా సీరియస్ అంశం. మళ్లీ ఇలా వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకుంటాం’ అని శైలజ స్పష్టం చేశారు.
Author: apanalysis
భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దిగువకు నీళ్లు వెళ్లకుండా ఆపేసింది. మా నీళ్లు ఎవరూ ఆపలేరని ఈ ఒప్పందాన్ని రద్దు చేసినపుడు పాకిస్తాన్ లోని రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వరుసగా లేఖలు రాస్తోంది. దాహం వేస్తోంది.. మంచినీళ్లు ఇవ్వండి ప్లీజ్ అంటోంది. మిత్రుడు చైనాతో కలిసి బెదిరింపులకు పాల్పడుతోంది. బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు ఇచ్చేస్తేనే.. పాకిస్తాన్‌కు నీళ్లు ఇవ్వాలన్న పట్టుదలతో భారత్ ఉంది. భారత్ సింధూ జలాలు దిగువకు వెళ్లకుండా ఆపేయడంతో పాకిస్తాన్ లో దుర్బర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనీసం సగం వ్యవసాయంపై ప్రభావం పడుతోంది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పలు నగరాల్లో దాహార్తి కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో సిగ్గు విడిచి పాకిస్తాన్…
న్యూఢిల్లీ, జూన్ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ రైతులకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. కిసాన్ సమ్మాన్ పథకం 11వ వార్షికోత్సవం సందర్భంగా, రైతుల సంక్షేమానికి కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని మోడీ హామీ ఇచ్చారు. గత 11 సంవత్సరాలుగా, తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు రైతుల శ్రేయస్సును పెంచాయని, వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు (transformation) తీసుకువచ్చాయని ప్రధాని మోడీ అన్నారు. నేల ఆరోగ్యం (soil health) మరియు నీటిపారుదల (irrigation) వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. రైతుల సంక్షేమం పట్ల తమ నిబద్ధత మరింత పెరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ ఫసల్ బీమా (insurance) మరియు కనీస మద్దతు ధర (MSP) పెంపు వంటి కీలక కార్యక్రమాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో ప్రాథమిక అవసరాల కోసం అప్పులు చేయాల్సిన రైతులు ఇప్పుడు వార్షిక నగదు సహాయం…
నాలుగు రోజుల పాటు ఆనందాల హేల.. లక్షలాది పర్యాటకుల సందర్శన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి సీ కయాకింగ్, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు.. బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో విజయవంతం అయిన మంత్రి కొల్లు రవీంద్ర.. మంగినపూడి బీచ్ లో ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిరాటంకంగా నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్ అద్భుతః అనేలా నిర్వహించారు. ఎండా లేదు.. వానా లేదు.. ట్రాఫిక్ లేదు.. మరొకటి లేదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది పర్యాటకుల ఆనందానికి ఏదీ అడ్డు లేదు. జూన్ 5వ తేదీ తొలిరోజు సాయంత్రం గేట్ ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్, వంద అడుగుల జాతీయజెండా ఆవిష్కరణతో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రులు కొల్లు రవీంద్ర,…
రాజధాని అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. స్థలం రాగానే నిర్మాణం చేపడతామని చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో స్టేడియం కోసం 65 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. లక్ష మంది కూర్చునేలా అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. 45 రోజుల్లోనే విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్‌లు విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ReplyForwardAdd reaction
పెళ్లి కోసం మధ్యవర్తుల ను ఆశ్రయించే యువకులకు షాక్ భర్త పిల్లలున్నా మరో పెళ్లి చేసుకున్న గృహిణి ఏపీ స్టేట్ బ్యూరో, పెళ్లి సంబంధాల కోసం మధ్యవర్తులను నమ్మే యువకులకు పెద్ద షాక్. భర్త, పిల్లలు ఉన్నప్పటికీ పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి అనంతపురం యువకుడిని ఇబ్రహీంపట్నానికి చెందిన గృహిణి మోసం చేసింది. సీఐ నాగరాజు ప్రత్యేక చొరవతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకునే ప్రయత్నంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు విజయవాడలోని మధ్యవర్తులను ఆశ్రయించాడు. ఇతని వాలకాన్ని చూసిన మధ్యవర్తి తనకు తెలిసిన ఒక యువతికి పెళ్లి కాలేదని, తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నం ఇచ్చి తనకు నగదు ఇస్తే పెళ్లి చేస్తానని నమ్మించాడు. అతని నుంచి లక్షల రూపాయలు తీసుకుని అనంతపురం జిల్లాలో పెళ్లి చేశారు. పెళ్లయిన రెండు రోజులకే పెళ్లికూతురు తన నాయనమ్మ మరణించిందని కొత్త నాటకాన్ని ప్రధర్శించింది. ఆ అమాయక భర్త నిజమే…
జోగి… యుటర్నా ధిక్కార స్వరమా? ఏపీ స్టేట్ బ్యూరో, మాజీ మంత్రి జోగి రమేష్ స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ సాహసించరు. ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వరు. అయితే ఆదివారం నాటి జోగి స్టేట్ మెంట్ ఎటు నుంచి ఎటువైపునకు పరిస్ధితులు దారితీస్తాయో చూడాలి మరి. ఆ వివరాలు ఇవి. ఇక చదవండి. వైసీపీ ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం.. మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని మా నేత జగన్ దృష్టికి తీసుకెళ్తాం.. చివరికి మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే జగన్ 3 రాజధానుల నిర్ణయం.. మళ్లీ జగన్ సీఎం అయ్యాక అమరావతి రాజధాని నిర్మాణం చేస్తారు. చంద్రబాబు కూడా మేం చెప్పినట్టే విశాఖ ఆర్థిక…
విజయవాడలోని ఒక షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ కొత్త లుక్ లో కనిపించారు. ప్రజలు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. —
-వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం. టి.కృష్ణబాబు విజయవాడ జూన్ 8: గత జన్మలో చేసిన పుణ్యం లోని బ్యాలెన్స్ ఉండటం వల్లే ఈ జన్మలో మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం. టి.కృష్ణబాబు చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించడాన్ని ఉద్యోగులు ఎంత భాద్యతగా తీసుకుంటారో అదే రీతిలో ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఏపీ ఎన్జీజీవో పూర్వపు అధ్యక్షులు కె.వి.శివారెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చి ప్రసంగించారు. లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులలో అతి తక్కువ మందికి మాత్రమే ఉద్యోగ సంఘంలో నాయకులుగా పనిచేసే అవకాశం వస్తుందన్నారు. ఇటువంటి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పని చేయాలన్నారు. ఏపీ ఎన్జీజీవో పూర్వపు అధ్యక్షులు కె.వి. శివారెడ్డి తనకు రెండు దశాబ్దాల కాలంగా తెలుసన్నారు. ఉద్యోగుల ప్రయోజనం మినహా సొంత ప్రయోజనాల కోసం ఏనాడూ తన…
రాజకీయ, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై చర్యలు ఏపీ స్టేట్ బ్యూరో, రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు..రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని వివరించారు. తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని చెప్పారు.. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో పరిధిదాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు..